మనం సాధారణంగా వాతావరణంలో మార్పుల వలన మెరుపులు( Lightning ) మెరవడం, వరదలు రావడం మనం చూస్తూనే ఉంటాం.ఇలా వాతావరణం మార్పు వలన అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే మరికొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం తాజాగా చాలానే చూసాం.
అయితే అచ్చం అలాగే అసాధారణమైన సంఘటనలో ఒకటి సౌదీ అరేబియాలో( Saudi Arabia ) చోటుచేసుకుంది.అది ఏమిటి అంటే.
సౌదీ అరేబియాలోని మక్కా క్లాక్ టవర్ పై( Mecca Clock Tower ) మెరుపులు మెరుస్తున్నట్లు అద్భుతమైన ఫుటేజ్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సౌదీ అరేబియాలో మక్కా క్లాక్ టవర్ పై తుఫాను సమయంలో శక్తివంతమైన ఉరుపులు మెరుపులు సంభవించినట్లు తెలుస్తుంది.ఈ దృశ్యాన్ని అక్కడివారు చాలా మంది వీక్షించారు.అలాగే రాత్రిపూట ఆకాశాన్ని ప్రకాశించే మెరుపులను కూడా గమనించారు.
అత్యంత ప్రసిద్ధి చెందిన క్లాక్ టవర్లలో ఒకదాని మెరుపులు ఢీకొట్టడం మనం వీడియోలో గమనించవచ్చు.ఇక ఈ మక్కా క్లాక్ టవర్ అద్భుతమైన వాస్తు శిల్పం.
అలాగే నగరంలో ముఖ్యమైన పాంత్రంగా ప్రసిద్ధి చెందింది.
అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడి వారి ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదని తెలుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియోను చూసిన కొంత మంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇలాంటి అద్భుత ఘట్టాన్ని ఇంతవరకు చూడలేదని ఆయన కామెంట్ చేస్తున్నారు.
మరికొందేరేమో.చూడడానికే భయంగా ఉందని అలాంటిది అక్కడ పరిస్థితి ఏంటో అని కామెంట్ చేస్తున్నారు.