మచ్చలేని మెరిసే చర్మాన్ని అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా కోరుకుంటారు.అటువంటి చర్మం కోసం ఖరీదైన క్రీములు( Expensive creams ) వాడుతుంటారు.
అయినా సరే ముఖంపై ఏదో ఒక విధంగా మచ్చలు పడుతూనే ఉంటాయి.ముఖ్యంగా మొటిమల వల్ల చాలా మందికి ఫేస్ పై స్పాట్స్ ఏర్పడుతుంటాయి.
ఇవి ఓ పట్టాన అస్సలు పోవు.వీటిని వదిలించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరం మీకు చాలా బాగా సహాయపడుతుంది.రోజు నైట్ ఈ సీరం ను వాడితే మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది.మరి ఇంతకీ సీరం ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక నాలుగు నుంచి ఐదు తమలపాకులను( Betel leaves ) ముక్కలుగా తుంచి వేసుకోవాలి.
అలాగే నాలుగు లవంగాలు కూడా వేసి వాటర్ సగం అయ్యేంతవరకు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారపెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం అనేది సిద్ధమవుతుంది.

ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.నిత్యం నైట్ నిద్రించే ముందు ముఖానికి మేకప్ ఏమైనా ఉంటే తొలగించి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న సీరం ను ముఖానికి అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత పడుకోవాలి.
ఇలా ప్రతిరోజు కనుక చేశారంటే మంచి రిజల్ట్ పొందుతారు.

ఈ న్యాచురల్ సీరం ముఖం పై ఎటువంటి మచ్చలు ఉన్న కూడా వాటిని చాలా వేగంగా తగ్గిస్తుంది.మొటిమల సమస్యను దూరం చేస్తుంది.స్కిన్ పిగ్మెంటేషన్ కు అడ్డుకట్ట వేస్తుంది.
మచ్చలేని చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.అలాగే ఈ సీరంను వాడటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది.చర్మం స్మూత్ అండ్ సాఫ్ట్ అవుతుంది.
కాబట్టి ముఖం పై మచ్చలు పోగొట్టుకోవాలని అనుకునేవారు, అందంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ న్యాచురల్ సీరం ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.