ఇటీవల కాలంలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య( White hair problem ) బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది.తెల్ల జుట్టు మనల్ని ముసలి వారిలా చూపించడమే కాకుండా మనోధైర్యాన్ని కోల్పోయేలా చేస్తాయి.
తలలో తెల్ల వెంట్రుకలు కనబడగానే చాలా మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.కానీ ఒత్తిడి పల్ల మీ జుట్టు మరింత వేగంగా తెల్లబడుతుంది.
కాబట్టి ఒత్తిడిని పక్కనపెట్టి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చూడాలి.అయితే తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కొన్ని వంటింటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వులు తెల్ల జుట్టు సమస్యను పరిష్కరించడానికి ఉత్తమంగా సహాయపడతాయి.
మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వులను ( Sesame seeds )వాటర్ లో నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రాండ్ వేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు బాదం నూనె ( Almond oil )కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ తో జుట్టును కడిగేయాలి.

అలాగే ఉల్లి రసంతో( onion juice ) కూడా తెల్ల జుట్టు సమస్యను పరిష్కరించవచ్చు.ఉల్లిపాయను మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ ను జుట్టుకు ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.
రెండు గంటల తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే తెల్ల జుట్టు నల్లబడుతుంది.

ఇక ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఉసిరి పొడి, నాలుగు టేబుల్ స్పూన్లు నిమ్మరసం( lemon juice ), మూడు టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట తర్వాత తేలిక పాటి షాంపూతో తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేసినా కూడా తెల్ల జుట్టుకు బై బై చెప్పవచ్చు.
ఇక ఈ చిట్కాలతో పాటు డైట్ లో పాలకూర, కరివేపాకు, నల్ల నువ్వులు, వాల్ నట్స్, మునగాకు, చిలగడదుంప, క్యారెట్, బాదం వంటి ఆహారాలు ఉండేలా చూసుకోండి.ఇవి జుట్టు ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.
తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మారుస్తాయి.