టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి( Megastar Chiranjeevi ) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.చిరంజీవి రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
అయితే చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత( Sushmita ) ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లను నిర్మించడం జరిగింది.అయితే సుష్మితకు చిరంజీవితో ఒక సినిమాను నిర్మించాలనే కల ఉండగా ఆ కల నెరవేరే రోజు అయితే వచ్చింది.
చిరంజీవి అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కాంబో మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కనుండగా ఈ బ్యానర్ తో పాటు సుష్మిత సొంత బ్యానర్ కూడా యాడ్ కానుంది.అనిల్ రావిపూడి ఇప్పటివరకు తెరకెక్కించిన 8 సినిమాలు హిట్టైన నేపథ్యంలో ఈ సినిమా కూడా ష్యూర్ షాట్ హిట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాకు లాభాలు వస్తే సుష్మితకు కూడా సగం లాభాలు దక్కనున్నాయి.

అనిల్ రావిపూడి ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని సమాచారం అందుతోంది.అనిల్ రావిపూడి పారితోషికం సైతం భారీ స్థాయిలో పెరిగింది.వరుసగా విజయాలు సాధించడం కూడా అనిల్ రావిపూడికి అన్ని విధాలుగా ప్లస్ అవుతోందన్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అనిల్ రావిపూడి పాన్ ఇండియా హిట్లను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంకుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అనిల్ రావిపూడి చిరంజీవి కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారో చూడాల్సి ఉంది.అనిల్ రావిపూడి చిరంజీవి ప్రాజెక్ట్ తో ట్రిపుల్ హ్యాట్రిక్ అందుకోవాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
సుష్మిత ఈ సినిమాతో నిర్మాతగా సక్సెస్ సాధిస్తే చిరంజీవి భవిష్యత్తు సినిమాలను సైతం నిర్మించే అవకాశాలు అయితే ఉన్నాయి.సుష్మిత కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







