ఆదిత్య 369 సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య.. ఆ విషయంలో అస్సలు తగ్గనంటూ?

నందమూరి నటసింహం బాలయ్య బాబు (Nandamuri Natasimham Balayya Babu)గురించి ప్రత్యేకంగా పరిశ్రమ అక్కర్లేదు.బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

 Balakrishnas Comment On Second Innings, Balakrishna, Tollywood, Second Innings,-TeluguStop.com

వరుస సినిమాలతో ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు బాలయ్య బాబు.కాగా బాలయ్య బాబు ఇటీవల వరుసగా నాలుగు సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ ని అందుకున్న విషయం తెలిసిందే.

అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్(Akhanda, Veera Simha Reddy, Bhagwant Kesari, Daku Maharaj) వంటి సినిమాలతో వర్సగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.

Telugu Aditya, Akhanda, Balakrishna, Balakrishnas, Bhagwant Kesari, Daku Maharaj

ఇప్పుడు అఖండ 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు బాలయ్య.ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాలు అందుకోవడం ఖాయం అని తెలుస్తోంది.ఇకపోతే బాలయ్య బాబు నటించిన ఆదిత్య 369(Aditya 369 ) సినిమా ఏప్రిల్ 4వ తేదీన ఫ్రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా తాజాగా హైదరాబాదులో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మూవీ మేకర్స్.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య బాబు ఆసక్తికర వార్తలు చేశారు.

ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.

Telugu Aditya, Akhanda, Balakrishna, Balakrishnas, Bhagwant Kesari, Daku Maharaj

సెకండ్ ఇన్నింగ్స్ నాకు తెలియదు.విజయవంతమైన సినిమాలు, మూడుసార్లు ఎమ్మెల్యే, అన్ స్టాపబుల్ షో, క్యాన్సర్ ఆసుపత్రి ఇలా అన్ని చేసుకుంటూ వచ్చాను.కొడుకుని, మనవడిని అందరిని మెప్పిస్తూ ఇప్పటి రెండు జనరేషన్లకు కనెక్ట్ అయ్యేలా అన్ని జానర్లలో చిత్రాలు చేయడం మా నాన్న నుంచి అందుకున్న స్ఫూర్తి.

మాయాబజార్, సీతారామ కళ్యాణం, శ్రీ కృష్ణ పాండవీయం లాంటి క్లాసిక్స్ సరసన ఆదిత్య 369 ఉంటుంది.ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే నాకు ఈ సినిమా గొప్ప అనుభూతిని మిగిల్చింది.

అంతేకాదు ఆదిత్య 369 సీక్వెల్ త్వరలోనే ప్రారంభమవుతుంది.ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదు అని మరి ప్రత్యేకంగా నొక్కి చెప్పారు బాలయ్య బాబు.

ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube