నీరసం.సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
జ్వరం, శ్రమకు మించి పని చేయడం, టైంకు ఆహారాన్ని తీసుకోకపోవడం, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, అధికంగా వ్యాయామాలు చేయడం, మద్యపానం, మత్తు పదార్ధాలు సేవించడం తదితర కారణాల వల్ల నీరసం వేధిస్తూ ఉంటుంది.ఈ నీరసం కారణంగా ఏ పని పైన దృష్టి సారించలేకపోతుంటారు.
మంచానికే పరిమితం అవుతుంటారు.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తీసుకుంటే కనుక నీరసం పరార్ అవాడమే కాదు క్షణాల్లో సూపర్ ఎనర్జిటిక్ గా కూడా మారతారు.
మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గ్లాసు తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ను వేసుకోవాలి.
ఇప్పుడు గ్లాస్ సగానికి పైగా వాటర్ ను పోసుకొని చియా సీడ్స్ ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత గ్లాస్ లో చిటికెడు మిరియాల పొడి, చిటికెడు సాల్ట్, పావు టేబుల్ స్పూన్ అల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ షుగర్, నాలుగు ఫ్రెష్ పుదీన ఆకులు వేసి స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి.

చివరగా రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ వేసి కలిపితే మన డ్రింక్ సిద్ధమైనట్టే.నీరసంగా ఉన్నప్పుడు ఈ డ్రింక్ ను తీసుకుంటే కనుక క్షణాల్లో ఎనర్జిటిక్ గా మరియు యాక్టివ్ గా మారతారు.నీరసం పరార్ అవుతుంది.అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది.ఒత్తిడి, ఆందోళన, తలనొప్పి వంటి సమస్యల నుంచి సైతం మంచి ఉపశమనం లభిస్తుంది.కాబట్టి, నీరసంగా ఉన్నప్పుడు తప్పకుండా ఈ డ్రింక్‌ను తీసుకునేందుకు ట్రై చేయండి.