ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు రెమ్యునరేషన్ ను పెంచాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు.రెమ్యునరేషన్ ను పెంచడం ద్వారా తమ కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుందని భావించేవారు.
నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రెమ్యునరేషన్ ను పెంచడానికి హీరోయిన్లు ఇష్టపడేవాళ్లు కాదు.అయితే ప్రస్తుతం హీరోయిన్లు మాత్రం పూర్తిస్థాయిలో మారిపోయారు.
ఒక్క సినిమా సక్సెస్ సాధించినా భారీగా రెమ్యునరేషన్ ను పెంచేస్తున్నారు.
రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందడి సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చినా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.
కొన్ని నెలల క్రితం వరకు లక్షల్లో పారితోషికం తీసుకున్న శ్రీలీల ప్రస్తుతం కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం శ్రీలీల పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో హీరోయిన్ గా నటిస్తుండటం గమనార్హం.
శ్రీలీల నటిస్తున్న ధమాకా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే శ్రీలీల స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరినట్టేనని చెప్పవచ్చు.
కృతిశెట్టి కూడా కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలు అందుకున్నా ఆ తర్వాత వరుస ఫ్లాపులు ఆమె సినీ కెరీర్ పై ఊహించని స్థాయిలో ప్రభావం చూపాయి.శ్రీలీల రేంజ్ అంతకంతకూ పెరుగుతుందో చూడాల్సి ఉంది.

మరీ భారీగా శ్రీలీల రెమ్యునరేషన్ ను పెంచడం మాత్రం కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శ్రీలీల ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.శ్రీలీల కెరీర్ విషయంలో మరింత ఎదగాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.శ్రీలీల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.టాలెంట్ పుష్కలంగా ఉన్న ఈ హీరోయిన్ సరైన కథను ఎంచుకోవాలని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.శ్రీలీలకు యంగ్ హీరోలకు జోడీగా ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.