పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే పండ్లలో దానిమ్మ ఒకటి.అయితే దానిమ్మ పండును తినేటప్పుడు లోపల ఉన్న గింజలను తీసుకుని.
తొక్కలను డస్ట్ బిన్‌లోకి తోసేస్తుంటారు.కానీ, తొక్కల్లోనూ అనేక పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే అవి మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంటాయి.ముఖ్యంగా దానిమ్మ తొక్కలు హెయిర్ ఫాల్ సమస్యను నివారించడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.
అసలు దానిమ్మ తొక్కలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.మరి ఇంకెందుకు లేటు దానిమ్మ తొక్కలను కేశాలకు ఎలా ఉయోగించాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా రెండు దానిమ్మ పండ్లను తీసుకుని.వాటికి ఉన్న తొక్కలను ఒలిచి పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో దానిమ్మ పండ్ల తొక్కలు, వన్ టేబుల్ స్పూన్ లవంగాలు, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు హీట్ చేయాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్‌ను మాత్రం స్ట్రైనర్ సాయంతో సపరేట్ చేసుకోవాలి.ఈ వాటర్ పూర్తిగా కూల్ అయిన వెంటనే అందులో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రై బాటిల్‌లో నింపి.జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు స్ప్రే చేసుకోవాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.ఇలా వారంలో ఒకసారి చేస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.
దాంతో ఊడటం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.