జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇలాంటి జబర్దస్త్ ద్వారా సక్సెస్ అందుకున్న వారిలో రచ్చ రవి( Raccha Ravi ) ఒకరు.
తీసుకోలేదా రెండు లచ్చల కట్నం అనే డైలాగు ద్వారా ఈయన పెద్ద ఎత్తున ఫేమస్ అయ్యారు.ఇక జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూనే మరోవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా ఒక వైపు సినిమాలు మరోవైపు బుల్లితెర కార్యక్రమాలు అంటూ రచ్చ రవి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించారు.

ఇదిలా ఉండగా ఇటీవల రచ్చ రవి పెళ్లిరోజు( Raccha Ravi Wedding Anniversary )కావడంతో ఈయన తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను అలాగే తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.నిన్ను పరిచయం చేసిన నీ… నా… తల్లిదండ్రుల రుణం తీరదు.నా జీవన ప్రయాణంలో నీ పూర్తి సహాయ సహకారం అందిస్తున్న నాకు తృప్తి ఉండదు.
ఎన్ని ఆశలు.కోరికలు.
ఇష్టాలు.ఉన్నాయో నీకు వాటిని నేను తీర్చగలనో లేదో అని ఎన్నడు నేను అడగలేదు.
నువ్వు చెప్పలేదు.

నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణానికి వసంతాలు పూయిస్తూ కష్టాలను భరిస్తూ దుఃఖాలను దిగమింగుకుంటూ… కాంప్రమైజ్ అవుతూ లైఫ్‌లో నన్ను సక్సెస్ చేయిస్తూ….ఇదే జీవితంలో నీ ఇష్టాలు కోరికలు ఆశలను తీర్చాలని… అంత శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని, నా నిస్వార్థ కోరిక అర్థం చేసుకొని ఇస్తాడని….నీ రుణం కూడా తీరదని తెలిసి కూడా కనీసం వడ్డీగానైనా ప్రేమిస్తానని ప్రేమగా చూసుకుంటానని…నా సహచరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ తన భార్య గురించి సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు కూడా ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.







