సాధారణంగా ఒక్కోసారి ముఖం తో సంబంధం లేకుండా మెడ నల్లగా( Dark Neck ) మారిపోతుంటుంది.మహిళల్లో ఈ సమస్య అత్యధికంగా కనిపిస్తుంటుంది.
ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో మరియు డెలివరీ అనంతరం చాలా మంది మహిళలు ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు.అలాగే ఎండల ప్రభావం, మృత కణాలు పేరుకుపోవడం, శరీరంలో అధిక వేడి తదితర కారణాల వల్ల కూడా మెడ నల్లగా మారుతుంటుంది.
దీంతో మెడ ఒక రంగులో, ముఖం మరొక రంగులో వేరు పాటుగా కనిపిస్తాయి.ఈ క్రమంలోనే మెడ నలుపును వదిలించుకునేందుకు తోచిన ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే కేవలం వారం రోజుల్లోనే మీ మెడ తెల్లగా మెరుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం మెడ నలుపును వదిలించే ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న క్యారెట్ ను( Carrot ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక టమాటో ని( Tomato ) తీసుకుని వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసి కొద్దిగా వాటర్ పోసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక కప్పు రోజ్ వాటర్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో నింపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.నాలుగు గంటల అనంతరం రెండు తయారు చేసుకున్న ఐస్ క్యూబ్స్ ను తీసుకుని మెడకు బాగా రబ్ చేయాలి.ఆపై పది నిమిషాల పాటు మెడను ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే మెడ ఎంత నల్లగా ఉన్నా సరే వారం రోజుల్లోనే తెల్లగా మారడం ప్రారంభమవుతుంది.
మెడ నలుపును నివారించడానికి ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.మెడ ని తెల్లగా, కాంతివంతంగా మెరిపిస్తుంది.