ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.01
సూర్యాస్తమయం: సాయంత్రం 06.29
రాహుకాలం: మ.12.00 ల1.30 వరకు
అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది సక్రమంగా సాగుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
మీరంటే గిట్టని వారు విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మిథునం:
ఈరోజు మీరు ఆర్థికంగా డబ్బు ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
కర్కాటకం:
ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
సింహం:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కన్య:
ఈరోజు మీరు ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
తులా:
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడమే మంచిది.మీ శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది.దూరప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
వృశ్చికం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
ధనస్సు:
ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.కొన్ని ప్రారంభించిన పనులను వాయిదా వేయాలి.మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
మకరం:
ఈరోజు మీరు చేపట్టిన పనులలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ మాటలతో ఇతరుల మనసు నొప్పిస్తారు.
మీరంటే గిట్టని వారే విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
కుంభం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి సమయానికి మీ చేతికి అందుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు.
మీనం:
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఇతరుల నుండి ఆర్థికంగా మీకు సహాయం అందుతుంది.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
LATEST NEWS - TELUGU