ప్రతి ఇంటిలో అందరు సుఖ సంతోషాలతో మరియు సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటారు.మనం ఇంటిలో దేవుడి ఫోటోలను మనకు ఇష్టం వచ్చిన ప్రదేశాలలో పెడుతూ ఉంటాం.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిక్కున ఫోటోలను ఏ దేవుడి
ఫోటోలను పెడితే సుఖ సంతోషాలతో మరియు సిరి సంపదలతో ఉంటామో తెలుసుకుందాం.
పంచ ముఖ ఆంజనేయ స్వామి
ఈ ఫోటోను ఇంటిలో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది.
అయితే పంచ ముఖ ఆంజనేయ
స్వామి ఫోటోను తూర్పు ముఖంగా పెడితే పాపాలను హరించటమే కాకుండా మనకు ఉన్న
బాధలు మరియు కష్టాల నుండి రక్షిస్తారు.
కరాళ ఉగ్ర నరసింహ స్వామి
కరాళ ఉగ్ర నరసింహ స్వామిను దక్షిణ ముఖంగా పెడితే శత్రు భయం లేకుండా
విజయాన్ని అందిస్తారు.
అలాగే ఎటువంటి చెడు ప్రభావాలు మన మీద పడకుండా ఈ
స్వామి మనకు రక్షణగా ఉంటారు.
లక్ష్మి వరాహ మూర్తి
లక్ష్మి వరాహ మూర్తి ని ఉత్తర ముఖంగా పెడితే గ్రహ బాధలు లేకుండా చేసి
సిరి సంపదలు కలిగేలా స్వామి అనుగ్రహిస్తారు.
మహా వీర గరుడ స్వామి
మహా వీర గరుడ స్వామిని పడమర ముఖంగా పెడితే చెడు ప్రభావాలను పోగొడతారు.అలాగే శరీరం మీద కలిగే విష ప్రభావాలను తొలగించి ఆయుష్షు పెరిగేలా
అనుగ్రహం ఉంటుంది.
ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవ స్వామి
ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవ స్వామి మనకు జ్ఞానాన్ని,మంచి భాగస్వామిని
,సంతానాన్ని ప్రసాదిస్తారు.