చాలాచోట్ల గుమ్మిడికాయను పురుషులే ఎందుకు పగులగొడతారంటే..

గుమ్మడికాయకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉంది.చాలా ఇళ్లలో స్త్రీలు గుమ్మడికాయను పగులగొట్టరు.

 Why Does Women Never Cut Pumpkin,  Pumpkin, Women, Tradition, Men, Mother , Son,-TeluguStop.com

లేదా కోయరు.ఇందుకోసం పురుషుల సహాయం తీసుకుంటారు.

మొదట పురుషులు గుమ్మడికాయను కట్ చేస్తారు లేదా రెండు ముక్కలుగా పగులగొడతారు ఆ తర్వాత మహిళలు దానిని కూరలలో వేసేందుకు కట్ చేస్తారు.ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా? దేశంలోని అనేక ప్రాంతాలలో స్త్రీలు గుమ్మడికాయను తమ పెద్ద కొడుకుగా పరిగణిస్తారు.అందుకే దానిని కోయరు అనే నమ్మకం ప్రభలంగా ఉంది.హిందూ సమాజంలో పురాణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.జంతు బలులు నిర్వహించని అనేక మతపరమైన ఆచారాలలో, గుమ్మడికాయను జంతువు యొక్క చిహ్నంగా పరిగణించి బలి ఇస్తారు.ఛత్తీస్‌గఢ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో, గిరిజన సమాజానికి చెందిన మహిళలు గుమ్మడి కాయను కట్ చేసే ఆలోచన కూడా చేయరు.

ఒక స్త్రీ గుమ్మడికాయను కోస్తే తన పెద్ద కొడుకును బలి ఇచ్చినట్లు అవుతుందని చాలామంది నమ్ముతుంటారు.అందుకే చాలామంది స్త్రీలు గుమ్మడికాయను పురుషుని చేత ముందుగా ముక్కలు చేయించి ఆ తరువాత కూర కోసం చిన్న ముక్కలుగా తరుగుతారు.

గుమ్మడికాయ, కొబ్బరికాయలు సనాతన ధర్మంలో సాత్విక ఆరాధనలో త్యాగానికి ప్రాతినిధ్యం వహించే పండ్లు అని కాశీకి చెందిన పండితులు చెబుతుంటారు.సనాతన సంప్రదాయంలో, స్త్రీ సృష్టికర్త, నాశనం చేసేది కాదు.

ఆమె జన్మనిస్తుంది.తల్లిగా ఉంటుంది.అందుకే గుమ్మడికాయను మహిళలు పగులగొట్టరు.దేశంలోని అనేక ప్రాంతాలలో ఈ ఆచారం కొనసాగుతోంది.కాగా సాధారణంగా గుమ్మడికాయలు రెండింటిని కట్ చేస్తారు.ఒక్కటే కట్ చేయవలసి వస్తే మరో కూరగాయను జత చేసి కట్ చేస్తారు.

ఇందుకోసం నిమ్మకాయ, మిరపకాయ లేదా బంగాళదుంపను ఉపయోగిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube