మొబైల్ ఫోన్ రాత్రి పక్కన పెట్టుకొని నిద్రపోతే ప్రమాదమా.. ముఖ్యంగా పురుషులకు..

ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ ఉపయోగించని మనిషి అంటు ఎవ్వరు లేడు.ఎందుకంటే ఈరోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే ఏ పని జరగడం లేదు.

 Is It Dangerous To Sleep With A Mobile Phone Next To It At Night Details, Mobile-TeluguStop.com

ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ మన వెన్నంటే మొబైల్ ఫోన్ ఉండాల్సిందే.మీరు డే టైంలో ఎంత వాడినా నిద్రపోయేప్పుడు మాత్రం ఫోన్‌ను వీలైనంత దూరంగా పెట్టాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈరోజుల్లో మొబైల్ ఫోన్ దూరంగా పెట్టమంటే ప్రతి ఒక్కరు చాలా బాధపడతారు.ఎందుకంటే ఆ మొబైల్ ఫోన్ వారిని నిద్ర వచ్చే వరకు నిద్ర పుచ్చుతుంది కాబట్టి.

దాదాపు ఈ మొబైల్ ఫోన్ల కు చాలా మంది అలవాటు పడిపోయారు.దీని వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరికీ ప్రమాదమే, ఇందులో మగవారికి రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది.

మొబైల్ ఫోన్ రేడియేషన్ కారణంగా అంగస్తంభన లోపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.బ్లూ కిరణాల కారణంగా నిద్రను ప్రేరేపించే మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది.

ఫోన్‌ల నుంచి వచ్చే రేడియేషన్‌ కారణంగా మెదడు క్యాన్సర్‌ వస్తుందని డబ్ల్యూహెచ్ఓ గతంలోనే హెచ్చరించింది.కాబట్టి ఫోన్‌ను అధికంగా వినియోగించకుండా మనకు మనమే కఠినమైన నియమాలు పాటించాలి.

ప్రతిరోజు ఫోన్‌ను కనీసం మూడు అడుగుల దూరంలో ఉంచి నిద్రపోవాలి.రాత్రి పూట నిద్రపోయే ముందు చాలా మంది ఫోన్‌తో టైమ్ పాస్ చేస్తుంటారు.ఇలా చేస్తే అరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అందుకే రాత్రి నిద్రపోయే సమయానికి అరగంట ముందు స్మార్ట్‌ ఫోన్‌ను పక్కన పెట్టడం చాలా మంచి విషయం.

ఇంకా చెప్పాలంటే నిద్రపోయే ముందు నోటిఫికేషన్స్ రాకుండా సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి.ప్రతిరోజు ఫోన్‌ పక్కనే ఉంచి నిద్రపోవడం వల్ల ఉదయం మూడీగా, అలసిపోయినట్టు, డిస్టర్బ్‌గా నిద్ర లేచే అవకాశం ఉంది.

నిద్రపోయే ముందు ఫోన్ చూడటం వల్ల మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ, స్థూలకాయం, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube