గరికపాటి పై ఆర్జీవి హాట్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి -గరికపాటి నరసింహారావు వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.ఇటీవల బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి పాల్గొన్నారు.

 Rgv Hot Comments On Garikapatiki-TeluguStop.com

అయితే, అక్కడి వచ్చిన వాళ్లు చిరంజీవితో ఫొటోలు దిగడానికి ఎగబడ్డారు.అయితే, చిరంజీవి ఫొటోలు దిగడం వేదికపై కూర్చోకపోతే తాను నిర్మొహమాటంగా అక్కడి నుంచి వెళ్లిపోతానంటూ గరికపాటి అసహనం వ్యక్తం చేశారు.

చిరును అవమానించేలా గరికపాటి మాట్లాడరని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గరికపాటి ఏదో మూడ్ లో అలా అని ఉంటారని ఆయన చేత క్షమాపణలు చెప్పించుకోవడం తమ ఉద్దేశం కాదని నాగబాబు ట్వీట్ చేశారు.

గరికపాటి గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని ఫ్యాన్స్ కు సూచించారు.అయితే, అదే ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ వరుసగా ట్వీట్లు చేస్తూ వివాదం మరింత ముదిరేలా చేస్తున్నారు.

నేరుగా గరికపాటి పేరు వాడకుండా తన దైన శైలిలో విమర్శలు చేశారు.‘ఐ యాం సారీ నాగబాబు గారు.

మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, తగ్గేదెలె’ అని తేనె తుట్టిని కదిపారు.

ఆపై మరిన్ని ట్వీట్లు చేశారు.‘హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.

మెగాస్టార్ ఏనుగు.నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో’ అని ఓ ట్వీట్ చేశారు.

‘హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి.

సర్ నాగబాబు గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు.

సర్ నాగబాబుగారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ని ఎందుకు ఇచ్చారు సర్ .సర్ సర్ సర్ చిరంజీవి ?‘ అంటూ ఆర్జీవీ ట్వీట్లు చేశారు.ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube