రాత్రిపూట ఎలాంటి విరామం లేకుండా, సుఖంగా, ప్రశాంతంగా 7-8 గంటల నిద్రపోవాలని ఎవరికి ఉండదు.అదే మనిషి శరీరానికి అవసరం కూడా.
కాని కొందరు ఆహారపు అలవాట్లతో నిద్ర చెడగొట్టుకుంటారు.బాహుషా, నిద్రలోకి జారుకోవడానికి సహాయపడే ఆహారం ఏదో, నిద్రను చెడగొట్టే ఆహారం ఏదో అవగాహన లేకపోవడం వలనేమో.
అందుకే నిద్రకి ముందు ఏ ఆహారం తినాలో, ఏం తినకూడదో చూద్దాం.
* రాత్రిపూట లైట్ ఆహారం తీసుకోవడమే మంచిది.
వినే ఉంటారు, “డైన్ లైక్ ఏ బెగ్గర్” అనే సామెత.కాబట్టి స్పైసీ, హెవీ ఆహారం వద్దు.
ఆసిడ్ రిఫ్లక్స్ సమస్యతో నిద్ర చెడిపోవచ్చు.
* కాఫీ మెదడుని ఉత్తేజపరచడానికి పనిచేస్తుంది.
దీన్ని ఉదయంపూట, వర్కింగ్ అవర్స్ లో తీసుకోవాలి.విశ్రాంతి తీసుకునేటప్పుడు కాదు.
* ఆల్కహాల్ తాగడం, నీళ్ళి అతిగా తాగడం కూడా నిద్రకి ముందు చేయకూడని పనులు.మధ్యలో మూత్రవిసర్జన కోసం నిద్ర లేవాల్సి వస్తుంది.
* చెర్రిల్లో నిద్రకు ఉపయోగపడే మెలాటోనిన్ ని ఉత్పత్తి చేస్తాయి.కాబట్టి ట్రై చేయండి.
* అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం ఉండటం వలన ఇది రిలాక్సేషన్ కి ఉపయోగపడుతుంది.
* స్వీట్ పొటాటోలో కూడా పొటాషియం ఉంటుంది.
ఇది కూడా అరటిపండు లాగే నిద్రకి ఉపయోగపడుతుంది.