ఒక చరిత్ర సృష్టించాలంటే కొన్ని త్యాగాలు జరగాలి.స్వాతంత్య్రం కోసం ఎందరో తమ ప్రాణాలను పణంగా పెడితేనే ఈ రోజు ఆ స్వేచ్ఛ తో మనం బ్రతుకుతున్నాం.
అలాగే ఒక వ్యక్తి విదేశాల్లో తనకు తెలిసిన విషయాన్నీ మన భారత దేశంలో ప్రవేశ పెడితే అది కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాం.అదే సినిమా.
సినిమాను మన భారతీయలను పరిచయం చేసింది దాదా సాహెబ్ ఫాల్కే( Dada Saheb Phalke ).సినిమా తీస్తూ తీస్తూ ఉన్న ఆస్తులను పోగొట్టుకున్నారు.సినిమా పైన ఈ రోజు వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది.కానీ అయన మాత్రం ఒక్క రూపాయి చేతిలో లేకుండా కన్ను మూసారు.

అయన ఒక్కడు పోకుండా తన వారసులకు రూపాయి ఆస్తిని కూడా మిగల్చలేదు.లోకం ఎవరైనా బాధల్లో ఉంటె జాలి పడుతుంది కానీ సహాయం చేయదు.అందుకే ఎన్నో ఆస్తులను కరగపెట్టి సినిమా తీస్తే అది చివరికి ఆయన పాలిట శాపం గా మారింది.ఫాల్కే పిల్లలకు ఏం మిగలార్చలేదు.ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు.అందుకే ఫాల్కే కుమారుడు ముంబై( Mumbai ) వీధుల్లో చిల్లర వ్యాపారాలు చేసుకొని జీవనం సాగించాడు.
ఫాల్కే సినిమాల్లో బిజీ గా ఉన్నప్పుడు ఫోర్డ్ కారు వాడేవారు.ఆ తర్వాత ఒక సినిమా తీయడం కోసం ఆ కారును అమ్మేస్తే అది పెళ్లిళ్లకు ఊరేగింపు కోసం వాడేవారు.

ఆ తర్వాత నాసిక్ డంపు యార్డు ( Nashik Dump Yard )లో అద్వాన్నంగా స్థితిలో ఆ కారు కనిపించింది.ఆలా చివరికి దాదా సాహెబ్ ఫాల్కే ఆస్థి మొత్తం పోగా భార్య ఒంటి మీద నగలను కూడా అమ్మేశాడు.ఫాల్కే చివరగా భారతీయ సినిమా రజతోత్సవ వేడుకలు( Silver jubilee celebrations ) జరుగుతుంటే అనామకుడిగా కూర్చునా ఫాల్కే ను గుర్తు పట్టిన శాంతారాం వేదిక పైకి తీసుకెళ్లి అయన పర్సు లో ఉన్న ఐదు వేలు ఫాల్కే చేతిలో పెట్టారట.ఆ డబ్బుతో ఎక్కడ మళ్లి సినిమా తీసి అవి కూడా పోగొట్టుకుంటాడో అని భయపడి కొంతమంది ఆయనకు ఇష్టం లేకపోయినా నాసిక్ లోనే ఒక ఇల్లు చూసి కొని అందులో పెట్టారట.
చివరికి ఫాల్కే ఆ ఇంటిలోనే కన్ను మూసారు.అయన తర్వాత అయన పిల్లలు ఆ ఇంట్లోనే ఉన్నారు.