జీడిపప్పు ( Cashew nuts )ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.స్వీట్స్, కర్రీస్, మిల్క్ షేక్స్, స్మూతీస్ తదితర ఆహారాల్లో జీడిపప్పును విరివిగా వాడుతుంటారు.
జీడిపప్పుతో స్నాక్స్ తయారు చేస్తుంటారు.టేస్టీగా ఉండడం వల్ల పెద్దలే కాదు పిల్లలు కూడా జీడిపప్పును తినడానికి ఎంతో ఇష్టపడుతుంటారు జీడిపప్పు పోషకాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ప్రోటీన్, ఫైబర్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ మెండుగా నిండి ఉంటాయి.ముఖ్యంగా రోజుకు నాలుగు జీడిపప్పులను తేనెతో కలిపి తీసుకుంటే అనేక ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.
జీడిపప్పు, తేనె( honey ) కాంబినేషన్ మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.జీడిపప్పులోని మెగ్నీషియం, తేనెలో ఉండే సహజ గ్లూకోజ్ మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది.ఫలితంగా మేధోశక్తి రెట్టింపు అవుతుంది.ఏకాగ్రత పెరుగుతుంది.
అలాగే మలబద్ధకంతో( constupation ) బాధపడేవారు రోజు ఉదయం నాలుగు జీడిపప్పులను ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోండి.జీడిపప్పులో ఫైబర్( Fiber ), తేనెలోని సహజ ఎంజైములు మలబద్దకాన్ని తగ్గిస్తాయి.
జీర్ణక్రియ పనితీరును పెంచుతాయి.

జీడిపప్పులోని విటమిన్ ఇ మరియు తేనెలోని యాంటీఆక్సిడెంట్లు( Antioxidants ) చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడంతో మరియు స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేయడంలో తోడ్పడతాయి.వ్యాయామం చేసిన తర్వాత చాలా నీరసంగా అనిపిస్తుంది.అలాంటి సమయంలో నాలుగు జీడిపప్పులను తేనె కలిపి తింటే చాలా మంచిది.
జీడిపప్పులో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, మరియు తేనెలోని సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.నీరసాన్ని తరిమికొడతాయి.

జీడిపప్పులను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల వాటిలోని జింక్, సెలెనియం వంటి పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.అంతేకాదు, జీడిపప్పు మరియు తేనె కాంబినేషన్ ఎముకలను దృఢంగా మారుస్తుంది.జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.అయితే జీడిపప్పులను మితంగా తీసుకోవాలి.అధికంగా తీసుకుంటే ఒంట్లో కొవ్వు పెరుగుతుంది జాగ్రత్త!
.






