మళ్లీ పెళ్లి( malli pelli )… నరేష్ పవిత్ర( Naresh ,Pavitra ) జంటగా నటించిన ఈ సినిమా రమ్య రఘుపతి( Ramya Raghupathi ) కేసు వేసినప్పటికీ కూడా అది సరైన టైంలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈరోజు థియేటర్లలో విడుదల అయింది.తనదైన వర్షన్ ని మాత్రమే నరేష్ ఈ చిత్రంలో చూపించి తన మూడవ భార్యపై ఉన్న కక్షను అంతా కూడా బయట పెట్టాడు.
నరేష్, రమ్య రఘుపతి పవిత్ర లోకేష్ తమ జీవితంలో వచ్చిన తర్వాత ఎన్నో గొడవలకు దారి తీయడంతో ఎవరికి వారు మీడియాకు ఎక్కి ఒకరిపై ఒకరు బురద జల్లుకున్నారు.అయితే నరేష్ ఈ సినిమా తీయడం వెనుక అసలు కథ ఏంటి అంటే నరేష్ ఎంత చెప్పినా కూడా మీడియా రమ్య వర్షం కూడా తమదైన రీతిలో బయటకు విడుదల చేస్తుండడంతో ఆమెపై కక్ష సాధించడం కోసం ఏకంగా సినిమా తీసి పడేసాడు.
ఈ చిత్రంలో రమ్య రఘుపతిని పూర్తిస్థాయిలో విలన్ ని చేసిన నరేష్ ఏమైనా దేశోద్ధారకూడా ? కాస్త ముందుగా మేలుకొని ఉంటే ఈ చిత్రం థియేటర్లోకి వచ్చేదే కాదు.ఎంతసేపు తనదైన వాదనను మాత్రమే సినిమా మొత్తం చూపించాడు నరేష్.తాను డబ్బు పెట్టి బూతు సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఎమ్మెస్ రాజును దర్శకుడుగా పెట్టుకుని మళ్ళీ పెళ్లి అనే సినిమా తీసి జనాలపై వదిలేశారు.ఇది ఒకరకమైన కక్ష సాధింపు బయోపిక్.
ఎవరికైనా అవతల వ్యక్తిపై కోపం వస్తే ఏం చేస్తారు పేపర్లో ప్రకటన లేదంటే ఏదైనా మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తారు.కానీ నరేష్ కు వచ్చి నాకు కోపానికి అతడికి ఉన్న డబ్బుతో ముడిపెట్టి సినిమా తీశాడు అంతే.
ఇలా కక్ష సాధింపు చిత్రాలు తీయాలి అనుకుంటే గతంలో ఎంతో మంది తీయాలి గాడ్సే( Godsey ) కూడా డబ్బుంటే ఒక సినిమా తీసేవాడు తాను గాంధీని ఎందుకు చంపాలి అన్న విషయంపై అప్పటికే ఓ పుస్తకాన్ని రాసేశాడు కూడా అలా ఎవరికి నచ్చినట్టుగా వారు సినిమాలు తీసుకుంటూ వెళ్లి జనాలకు ఎందుకు ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ సృష్టిస్తారు అర్థం కాదు కానీ ఇది ఒక అనవసరమైన పెంట అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు .ఈ సినిమాలో జనాలు చూడదగ్గ అంశం ఒక్కటి లేదు.ఈ సినిమా ఎందుకు తీసారో కూడా ఎవరికి అర్థం కాలేదు.తానే చేసుకోబోయే నాలుగవ పెళ్లిలో ఎంతో పరమ పవిత్రత ఉందని చూపించే ప్రయత్నం చేశాడు తప్ప.
ఒక పవిత్ర మొదటి భర్త సుచంద్రని నరేష్ మూడో భార్య రమ్మను విలన్స్ గా చూపిస్తూ సినిమా తీసారు.