హెయిర్ ఫాల్ ( Hair fall )అనేది ప్రతి ఒక్కరిలో ఉండే కామన్ సమస్య.అయితే కొందరికి మాత్రం జుట్టు చాలా అధికంగా రాలుతుంటుంది.
పోషకాల కొరత, ఒత్తిడి కాలుష్యం, రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను వాడటం, హార్మోన్ చేంజ్, పలు రకాల మందుల వాడకం, దీర్ఘకాలిక వ్యాధులు తదితర కారణాల వల్ల జుట్టు విపరీతంగా ఊడుతుంటుంది.దీంతో ఈ సమస్య నుంచి బయటపడటం కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు.
కానీ కొన్ని ఇంటి చిట్కాలతో సులభంగా మరియు వేగంగా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.

మన ఇంటి పెరట్లో ఉండే తమలపాకులు హెయిర్ ఫాల్ కు సమర్థవంతంగా చెక్ పెట్టగలవు.మరి జుట్టు కు తమలపాకులను ( Betel leaves )ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు తమలపాకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.
అలాగే రెండు రెబ్బలు కరివేపాకు( curry leaves ) , రెండు మందారం ఆకులు( Hibiscus leaves ), ఐదు నుంచి ఆరు ఫ్రెష్ తులసి ఆకులు వేసుకోవాలి.చివరగా మూడు టేబుల్ స్పూన్ల పెరుగు మరియు కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె ( coconut oil )వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి అరగంట పాటు షవర్ క్యాప్ ధరించాలి.ఆ తర్వాత తేలిక పాటి షాంపూతో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని ఫాలో అయ్యారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.ఈ ప్యాక్ జుట్టు రాలడాన్ని ఎంతో వేగంగా అరికడుతుంది.జుట్టుకు చక్కని పోషణ అందిస్తుంది.కురుల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.
చుండ్రు సమస్యను నివారిస్తుంది.జుట్టును తేమగా సిల్కీగా మారుస్తుంది.
కాబట్టి ఆరోగ్యమైన ఒత్తైనా మెరిసే జుట్టు కోసం పైన చెప్పిన రెమెడీని తప్పక పాటించండి.