నటి శ్రీలక్ష్మి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.చక్కటి కామెడీ చిత్రాల్లో నటించి మంచి పేరు పొందింది.
ఆమె తమ్ముడు రాజేష్ కూడా మంచి నటుడు.హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు పొందాడు.
అయితే వయసులో ఉండగానే తనకు లివర్ సంబధ వ్యాధి సోకింది.ఆ కారణంగానే తను చనిపోయాడు.
అటు కామెడీ నటిగా శ్రీలక్ష్మి జంధ్యాల తెరకెక్కించిన పలు సినిమాల్లో నటించింది.జనాల నుంచి మంచి ఆదరణ పొందింది.
అయితే శ్రీలక్ష్మి సినిమా పరిశ్రమలోకి రావడం రాజేష్ కు అస్సలు ఇష్టం ఉండేది కాదు.సినిమాల్లో నటించకూడదని చెప్పినా.
తను వినలేదు.అందరూ కలిసి పనిచేస్తేనే ఫ్యామిలీ గడుస్తుందని చెప్పింది తను.అలా సినిమా రంగంలోనే కొనసాగింది.
శ్రీలక్ష్మి వాళ్ల నాన్న అమర్ నాథ్ కూడా సినిమా నటుడే.
ఆయన చనిపోయిన సమయంలో వీరి కుటుంబం హైదరాబాద్ లోనే ఉంది.అనంతరం కుటుంబం గడవడం కోసం మద్రాసుకు వెళ్లింది.
అమర్ నాథ్, భానుచంద్ర వాళ్ల నాన్న, ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు మంచి స్నేహితులు.అలా ఆ కుటుంబం అని తెలియడంతో వాళ్లింటికి వెళ్లారు శ్రీలక్ష్మి వాళ్ల.
ఆ ఇంట్లోనే రెంట్ కు ఉన్నారు.రాజేష్ కు జంధ్యాల సినిమా నెలవంకలో హీరోగా అవకాశం వచ్చింది.
దాని తర్వాత రెండు జెళ్ల సీత సినిమాలో నలుగురు హీరోలు ఉండగా.వారిలో ఒకడిగా రాజేష్ నటించాడు.
ఆ సినిమాలో ఓ చిన్న పాత్ర చేసింది శ్రీలక్ష్మి.సుత్తివేలు భార్యగా నటించింది.
అయితే తన అక్క సినిమాల్లోకి రావడం రాజేష్ కు అస్సలు నచ్చలేదు.అందుకే తను సినిమాల్లోకి వచ్చినా మొదట్లో సైలెంట్ గానే ఉన్నాడు.
మొదట రెండు రోజుల పాటు తన సీన్స్ తీసుకోవాలని జంధ్యాల అనుకున్నాడు.కానీ శ్రీలక్ష్మి, సుత్తివేలు మధ్య కామెడీ బాగా వస్తుందని తెలియడంతో వారి క్యారెక్టర్లను మరింత పెంచాడు.
అదే సమయంలో అక్కను సినిమాల్లో నటించకూడదని చెప్పాడు రాజేష్.తాను హీరోగా చేస్తున్న సినిమాలో నువ్వు చిన్న క్యారెక్టర్ చేయడం ఎందుకు? సినిమాల్లోకి రావడం అవసరం లేదు.ఇంటికి వెళ్లిపో అని చెప్పాడు.కానీ దానికి లక్ష్మి ఒప్పుకోలేదు.అందరం కలిసి పనిచేస్తేనే కుటుంబం గడుస్తుందని చెప్పింది.ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు ఆమె వెల్లడించింది.
అయితే తన నటనతో మంచి అవకాశాలు పొందింది శ్రీలక్ష్మి.అనంతరం మంచి గుర్తింపు తెచ్చుకుంది.