మనలో చాలా మందిని చుండ్రు సమస్య( Dandruff ) విపరీతంగా వేధిస్తూ ఉంటుంది.ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చుండ్రు ఓ పట్టాన వదిలిపెట్టదు.
పైగా చుండ్రు వల్ల హెయిర్ ఫాల్ పెరుగుతుంది.తలంతా తెగ దురద పెడుతుంటుంది.
ఈ క్రమంలోనే చుండ్రుతో బాగా విసిగిపోతుంటారు.చుండ్రును ఎలా దూరం చేసుకోవాలో తెలియక మదన పడిపోతూ ఉంటారు.
మీరు ఇది జాబితాలో ఉన్నారా.? అయితే మీకు సీతాఫలం ఆకులు అద్భుతంగా సహాయపడతాయి.
సీతాఫలం ఆకుల్లో( Custard Apple Leaves ) శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి స్కాల్ప్ ఇన్ఫెక్షన్( Scalp Infection )ను నివారించడానికి సహాయపడతాయి.మరి ఇంతకీ సీతాఫలం ఆకులను ఎలా తలకు ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఎనిమిది లేదా పది సీతాఫలం ఆకులు వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి సీతాఫలం ఆకులతో ఇలా చేస్తే చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.
కేవలం రెండు మూడు వాషుల్లోనే చుండ్రు మొత్తం మాయమవుతుంది.స్కాల్ప్ హెల్తీ గా మారుతుంది.
కాబట్టి చుండ్రు సమస్యతో సతమతం అవుతున్నారు తప్పకుండా సీతాఫలం ఆకులను తెచ్చుకుని ఈ విధంగా హెయిర్ మాస్క్ ను వేసుకునేందుకు ప్రయత్నించండి.ఈ హెయిర్ మాస్క్ తో మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
పైగా ఈ హెయిర్ మాస్క్( Hair Mask ) ను వేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.ఫలితంగా జుట్టు రాలడం సైతం తగ్గుతుంది.