ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, పలు రకరకాల మందుల వాడకం, మద్యపానం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, కంపూటర్ల ముందు గంటలు తరబడి కూర్చుని పని చేయడం, ధీర్ఘకాలిక వ్యాధులు, ఒత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది.ఈ క్రమంలోనే స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది జిమ్‌కు వెళ్తూ పెరిగిన బరువును కరిగించుకునేందుకు కఠినమైన కసరత్తులు చేస్తుంటారు.
అయితే జిమ్‌కు వెళ్లకుండా కూడా బరువు తగ్గొచ్చు.అలా తగ్గాలి అంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.మరి అవేంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.చాలా మంది బరువు తగ్గాలనే ఆత్రుతతో ఏం తినకుండా నోరు కట్టేసుకుంటారు.ఇలా చేయడం వల్ల మొదటికే మోసం వాస్తుంది.ఆహారాన్ని తీసుకోవాలి.
కానీ, తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు తీసుకోలి.మరియు తీసుకునే ఆహారంలో ఆయిల్ ఫుడ్స్, ఢీ ఫ్రై ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, షుగర్, మైదా వంటివి లేకుండా చూసుకోవాలి.
అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంటి పనులు చేసేందుకు పనిమనిషిని పెట్టుకుంటున్నారు.కానీ, ఇంటి పనులు చేయడం కూడా వ్యాయామంతో సమానమే.
కాబట్టి, సాధ్యమైనంత వరకు ఇంటి పనులు చేసేందుకు మొగ్గు చూపాలి.అలాగే టీవీ చూసేటప్పుడు దాదాపు అందరూ కుర్చీలకో, సోఫాలకో అతుక్కుపోతుంటారు.
అయితే ఇకపై టీవీపై చూసేటప్పుడు ఉత్సాహంగా మీకొచ్చిన డ్యాన్స్ ను చేమటలు పట్టేలా చేయండి.తద్వారా ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
గంటలు తరబడి వ్యాయామాలు చేయలేని వారు.రోజుకు కనీసం ఇరవై నిమిషాల పాటు స్కిప్పింగ్, రన్నింగ్, జంపింగ్ వంటివి చేస్తే ఫాస్ట్‌గా బరువు తగ్గొచ్చు.అలాగే రెగ్యులర్ డైట్‌లో ఏదో ఒక పండు ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే, బరువును తగ్గించడంతో పండ్లు గ్రేట్‌గా సహాయపడతాయి.ఇక డిన్నర్‌ను నిద్రపోవడానికి కనీసం మూడు నాలుగు గంటల ముందే ఫినిష్ చేయాలి.వాటర్‌తో పాటుగా డిటాక్స్ డ్రింక్స్‌ను డైట్‌లో చేర్చుకోండి.తద్వారా జిమ్ కు వెళ్లకుండానే వెయిట్ లాస్ అవ్వొచ్చు.