సినిమా డైరెక్టర్లు రొమాంటిక్, సైంటిఫిక్ ఫిక్షన్ నుంచి సస్పెన్స్ వరకు అన్ని జానర్లను టచ్ చేస్తారు.ముఖ్యంగా మన ఇండియన్, టాలీవుడ్ డైరెక్టర్లు దేశ ఆడియన్స్ మెచ్చే కేటగిరీలలో సినిమాలు చేస్తుంటారు.
వాటిలో మసాలా యాక్షన్ కామెడీ హారర్ సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ కూడా ఉంటాయి.పొలిటికల్ జానర్‌లో చాలానే సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి వాటిలో టాప్ 5 సినిమాలపై ఒక లుక్కేద్దాం.
1.లీడర్
2010లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రిలీజ్ అయిన “లీడర్” సినిమా( Leader Movie ) సూపర్ డూపర్ హిట్ అయింది.ఇందులో రానా హీరోగా నటించాడు.ఇందులో తండ్రి మరణించాక ఏపీ సీఎం అవుతాడు రానా.రాజకీయ వ్యవస్థను పట్టి పీడిస్తున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతాడు ఈ మూవీ బాగా ఆకట్టుకుంది.
2.నేనే రాజు నేనే మంత్రి
2017లో తేజ డైరెక్షన్‌లో వచ్చిన పొలిటికల్ డ్రామా “నేనే రాజు నేనే మంత్రి”( Nene Raju Nene Mantri ) మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.ఈ సినిమాలో కూడా రానా హీరోగా నటించాడు.
ఈ పొలిటికల్ డ్రామా థ్రిల్లింగ్ స్టోరీ లైన్‌తో కట్టిపడేసింది.
3.భరత్ అనే నేను
2018 లో మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా “భరత్ అనే నేను” ( Bharat Ane Nenu ) సూపర్ హిట్ అయింది.మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ఈ మూవీలో చూపించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
4.ప్రస్థానం
దేవకట్ట డైరెక్షన్‌లో 2010లో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిలిం “ప్రస్థానం”( Prasthanam Movie ) పాజిటివ్ రెస్పాన్స్ పొందింది.ఈ మూవీలో శర్వానంద్, సాయికుమార్, సందీప్ కిషన్ అదిరిపోయే పర్ఫామెన్స్ అందించి ఆకట్టుకున్నారు.
5.రంగం
కె.వి ఆనంద్ డైరెక్ట్ చేసిన “రంగం” సినిమా( Rangam Movie ) చాలా బాగా నడిచింది.
ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో జీవా, అజ్మల్ అమీర్, కార్తీక నాయర్ నటించారు.ఇంటెలిజెన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలబోసి ఈ సినిమా అద్భుతంగా తీశారని అప్పట్లో క్రిటిక్స్ దీనిపై ప్రశంసల వర్షం కురిపించారు.
తమిళంలో విడుదలైన ఈ సినిమా తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అయింది.
పైన పేర్కొన్న సినిమాలతో పాటు రిపబ్లిక్, నోటా, ఒకే ఒక్కడు, ప్రతినిధి, వంగవీటి వంటి సినిమాలు కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.