1.కెసిఆర్ పై కేంద్ర మంత్రి విమర్శలు
పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి అని, స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే పోరాటం చేయలేదు.బిజెపి కూడా పోరాటం చేసిందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
2.విశాఖకు మకాం… జగన్ కీలక ప్రకటన
డిసెంబర్ నాటికి విశాఖకు రాబోతున్నట్లు ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు.
3.తెలంగాణలో టిడిపి పోటీ
తెలంగాణలో 87 స్థానాల్లో పోటీకి అభ్యర్థులను దింపుతున్నట్లు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు.
4.మహిళా బిల్లు అమలు కోరుతూ సుప్రీం లో పిటిషన్
పార్లమెంట్ లో ఇటీవల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
5.రేవంత్ పై టీపీసీసీ కార్యదర్శి విమర్శలు
65 సీట్లను 600 కోట్లకు రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ రేవంత్ రెడ్డి పై సంచలన విమర్శలు చేశారు.
6.ఈటెల రాజేందర్ కామెంట్స్
కెసిఆర్ పై తాను పోటీ చేస్తానని ఆషామాషీగా చెప్పలేదని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
7.టిఆర్ఎస్ కు రాజీనామా
బీఆర్ఎస్ కు నీలం మధు ముదిరాజ్ రాజీనామా చేశారు.ముదిరాజ్ లకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు .
8.చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.
9.బాసరలో జస్టిస్ ఎన్వి రమణ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
10.గాయత్రీ దేవి అలంకరణలో బెజవాడ కనకదుర్గమ్మ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.రెండో రోజు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇచ్చారు.
11.భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సత్యవతి కన్నుమూశారు.తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
12.దుర్గమ్మ కు టీటీడీ తరపున పట్టు వస్త్రాలు
తిరుమల తిరుపతి దేవస్థానం తరపున బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి కి పట్టు వస్త్రాలు సమర్పించారు.
13.టీడీపీ తో కలిసి పోరాడుతాం : జనసేన
రైతు సమస్యలపై తెలుగుదేశం తో కలిసి పోరాటం చేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.
14.సీఐడీ విచారణకు కిలారు రాజేష్
సీఐడీ విచారణ కు హాజరైన లోకేష్ సన్నిహితుడు కీలారు రాజేష్.
15.అమరావతి అసైన్డ్ భూముల జీవో పై విచారణ వాయిదా
అమరావతి అసైన్డ్ భూముల జీవో పై విచారణ ను హై కోర్ట్ వాయిదా పడింది.
16.చంద్రబాబు పై కేసు నమోదు తప్పు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై కేసు నమోదు తప్పు అని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు.
17.బీ ఆర్ ఎస్ కు రాజీనామా
బీఆర్ ఎస్ కు పఠాన్ చెరువు నేత మధు రాజీనామా చేశారు.
18.శ్రీశైలం లో దసరా మహోత్సవాలు
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
19.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్మెంట్ లలో వేచి ఉన్నారు.
20.బోనులో చిరుతపులి
తెలంగాణలోని నారాయణ పేట జిల్లా మరికల్ మండలం పుసల్ పహాడ్, రాకొండ పరిసరాల్లో చిరుత పులి అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది.