వామ్మో .. టూత్ పేస్ట్ వాడటం కూడా ప్రమాదకరమేనా !

ఈ కాలంలో కెమికల్స్ లేని వస్తువు వాడాలనుకోవడం అత్యాశే.తినే తిండిలోనే కెమికల్స్ ఉంటున్నాయి, అలాంటిది వస్తువుల్లో ఉంటే ఆశ్చర్యమేముంది.

 Parabens In Toothpaste Can Cause Cancer-TeluguStop.com

మనం నోటి శుభ్రత కోసం వాడే టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందో లేదో కాని పరాబెన్స్ అనే కెమికల్స్ మాత్రం ఉంటున్నాయి.కేవలం టూత్ పేస్ట్ లోనే కాదు, షాంపూ, బాడి లోషన్స్, సన్ స్క్రీన్ లోషన్, ఇతర కాస్మెటిక్స్ లో కూడా పరాబెన్స్ వాడతారు.

ఇప్పుడు వీటివల్ల ప్రమాదం ఏంటంటే, రొమ్ము క్యాన్సర్‌ కి, ట్యూమర్ కి కారణమయ్యే లక్షణాలు కలిగి ఉంటుందట పరాబెన్స్.

టూత్ పేస్ట్, కాస్మేటిక్ ప్రాడక్ట్స్ లో పరానెన్స్ వాడటం వెంటనే ఆపివేయాలని డాక్టరు జి.వీ.రావు మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ కి కంప్లయింట్ చేసారు.ఆయన కంప్లయింట్ ని పరిశీలించిన మినిస్ట్రీ, ఈ విషయం మీద స్పందిస్తూ, పరాబెన్స్ వాడకాన్ని ఆపివేయలాని ఒక కాషన్ నోటిసు విడుదల చేసింది.

ఈ నొటీసు విడుదల చేయడానికి బలమైన కారణాలు, సాక్ష్యాలే ఉన్నాయి.2005 లో డాక్టర్ డేల్ లైట్మాన్ చేసిన అధ్యయనంలో పరాబెన్స్ క్యాన్సర్ కి కారణమవుతాయని తేలింది.ఈ కెమికల్స్‌ జంతువులకి కూడా ప్రమాదకరమని అదే పరిశోధనలో తెలిసింది.

ఆ తరువాత పోలాండ్, యూకేలో జరిపిన కొన్ని పరిశోధనల్లో డేల్ లైట్మాన్ చెప్పిన విషయాలు అక్షరసత్యాలని రుజువైంది.అందుకే పరాబెన్స్ వాడకాన్ని నిలిపివేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

మరి గవర్నమెంటు ఈ విషయాన్ని ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube