సమ్మర్ సీసన్ ( Summer season )లో చర్మ రక్షణ ఎంత కష్టతరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎండలు, అధిక వేడి కారణంగా చర్మం చాలా డ్యామేజ్ అవుతుంటుంది.
డార్క్ గా, డల్ గా మారుతుంటుంది.అయితే అటువంటి చర్మాన్ని రిపేర్ చేయడానికి, స్కిన్ ను సూపర్ బ్రైట్ గా మెరిపించడానికి సహాయపడే బెస్ట్ హోమ్ రెమెడీ ఒకటి ఉంది.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ చియా సీడ్స్( Chia seeds ) మరియు పావు కప్పు పచ్చి పాలు ( cup of raw milk )వేసుకుని బాగా మిక్స్ చేసి గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బీట్ రూట్ తురుము మరియు నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టీ స్పూన్ తేనె( honey ) మరియు వన్ టీ స్పూన్ రైస్ ఫ్లోర్ ( Rice flour )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని ప్రయత్నించడం వల్ల ఎండలు, అధిక వేడి వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ మళ్లీ పూర్వ స్థితికి చేరుకుంటుంది.టాన్ మొత్తం రిమూవ్ అవుతుంది.
చర్మం పై పేరుకుపోయిన దుమ్ము ధూళి తొలగిపోతాయి.డెడ్ స్కిన్ సెల్స్ వదిలిపోతాయి.
చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మారుతుంది.అలాగే ఈ హోమ్ రెమెడీ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
కాబట్టి, సమ్మర్ లోనూ స్కిన్ ను బ్రైట్ గా మెరిపించుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







