డ్రై స్పాల్ప్, ఫంగల్ ఇన్ఫెక్షన్, హార్ష్ కెమికల్స్ ఉన్న షాంపూలు, హెయిర్ జెల్స్ వాడడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, తక్కువగా తలస్నానం చేయడం లేదా రెగ్యులర్ గా తలస్నానం చేయడం, ఆలర్జీలు, కాలుష్యం, దుమ్ము వంటి కారణాల వల్ల చుండ్రు( dandruff ) ఎంతో మందిని ఇబ్బంది పెడుతుంటుంది.చుండ్రు అనేది సాధారణ సమస్యే అయినప్పటికీ కొందరిలో మాత్రం ఇది చాలా మొండిగా ఉంటుంది.
ఎన్ని రకాలుగా కనిపించిన చుండ్రు పోనే పోదు.అయితే ఎంతటి మొండి చుండ్రునైన ఒక్క వాష్ లో పోగొట్టే పవర్ ఫుల్ టిప్స్ కొన్ని ఉన్నాయి.
మరి అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేయండి.

రెమెడీ 1: ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు తులసి ఆకుల పొడిని( Tulsi leaf powder ) వేసుకోవాలి.అలాగే సరిపాడా బియ్యం( Rice ) నానబెట్టుకున్న వాటర్ పోసి బాగా మిక్స్ చేసి ప్యాక్ తయారు చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
తులసి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను( Antibacterial properties ) కలిగి ఉంటుంది.అందువల్ల ఇది చుండ్రును నివారిస్తుంది.ఇక రైస్ వాటర్ చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి.

రెమెడీ 2: ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ) వేసుకుని వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.ఉదయాన్నే నానబెట్టుకున్న మెంతులను మెత్తగా గ్రైండ్ చేసుకుని.అందులో రెండు టీ స్పూన్లు పెరుగు( curd ), వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon juice )మిక్స్ చేసి తలకు పట్టించాలి.
గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ రెమెడీ తల చర్మాన్ని పోషించి చుండ్రును తొలగిస్తుంది.డ్రై స్కాల్ప్ కు చెక్ పెడుతుంది.ఈ టిప్స్ ను ఫాలో అవ్వడంతో పాటు తలస్నానం వారానికి రెండు నుంచి మూడు సార్లు చేయండి.
హార్ష్ కెమికల్స్ లేని మైల్డ్ షాంపూ ఉపయోగించండి.ఒత్తిడికి దూరంగా ఉండండి.
తల చర్మాన్ని తేమగా ఉంచేందుకు ఆయిల్ మసాజ్ చేసుకోండి.పోషకాహారం తీసుకోండి.







