టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పనా( Popular singer Kalpana ) తాజాగా ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.ఈ విషయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపింది.
ఆమె నిద్ర మాత్రలు ( sleeping pills )వేసుకుంది.స్థానికులు పోలీసులు హుటాహుటిన వెంటనే హాస్పిటల్ కి తరలించిన విషయం తెలిసిందే.
అయితే ఆమె హాస్పిటల్ లో ఉన్న సమయంలో సూసైడ్ వెనుక కారణాలు ఇవే అంటూ రకరకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.కూతురి కారణంగా చేసుకుంది అంటూ కొన్ని వార్తలు వినిపించగా భర్త కారణంగా ఇలా చేసింది అంటూ కొన్ని వార్తలు వినిపించాయి.
అందరూ కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసిందనుకున్నారు.

మెల్లిగా కోలుకుంటున్న కల్పన, అసలు జరిగిన విషయాన్ని ఓ వీడియో ద్వారా వెల్లడించారు. తన భర్తపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, తనకు తన భర్తకు మధ్య ఎలాంటి గొడవలు లేవని, భర్త సహకారంతోనే తాను ఇప్పటికీ సంతోషంగా ఉన్నట్టు చెప్పిన కల్పన, తన భర్తపై మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఆపాలని కోరారు.మీడియాలో తమ ఫ్యామిలీపై జరుగుతున్న ప్రచారం గురించి అందరికీ వివరణ ఇవ్వడానికే వీడియో చేస్తున్నట్టు కల్పన తెలిపారు.
తనకు 45 సంవత్సరాలనీ, ఈ వయసులో కూడా తాను ఎల్ఎల్‌బీ, పీహెచ్‌డీ చేస్తున్నానంటే దానికి తన భర్తే కారణమని, సంగీతంలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవడానికి ఆయన ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారరు.

ఒక వైపు స్టడీస్, మరోవైపు సింగింగ్, కాన్సర్టులతో ఎక్కువ ఒత్తిడికి గురయ్యాను.డాక్టర్ల సలహా మేరకు నిద్ర మాత్రలు వాడుతున్నాను అని కల్పన తెలిపారు. ట్యాబ్లెట్స్ ఓవర్ డోస్( Tablets overdose ) అవడం వల్ల స్పృహ తప్పి పడిపోయాను తప్పించి, తాను ఆత్మహత్య చేసుకోలేదని, తనకు జీవితంలో అందిన గొప్ప గిఫ్ట్ తన భర్త అని, ఆయన వల్లే తాను తనకు నచ్చిన అన్ని పనుల్ని చేయగలుగుతున్నానని చెప్పిన కల్పన, తనపై చూపిస్తున్న ప్రేమకు ఎంతో కృతజ్ఞురాలినని చెప్పిన ఆమె త్వరలోనే మరిన్ని మంచి పాటలతో ఆడియన్స్ ను అలరించనున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







