ఎంత వద్దనుకున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల్లో మొటిమలు ముందు వరసలో ఉంటాయి.ఒక్క మొటిమ వచ్చిందంటే చాలు.
ముఖం ఎంత అందంగా, మృదువుగా ఉన్నా కాంతిహీనంగా కనిపిస్తుంది.అందుకే మొటిమలు అంటే భయపడుతుంటారు.
ఇకపోతే కొందరికి మొటిమలు వచ్చి మూడు, నాలుగు రోజుల్లో తగ్గిపోతాయి.కానీ, వాటి తాలూకు మచ్చలు మాత్రం అలానే ఉండిపోతాయి.
అవి ముఖ సౌందర్యాన్ని మరింత దెబ్బ తీస్తాయి.దాంతో ఆ మచ్చలను వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే చాలా సులభంగా మరియు వేగంగా మొటిమల తాలూకు మచ్చలను పోగొట్టుకోవచ్చు.మరి లేటెందుకు ఆ ఎఫెక్టివ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్, రెండు టేబుల్ స్పూన్ల మొలకెత్తిన పెసలు, రెండు టేబుల్ స్పూన్ల మొలకెత్తిన శనగలు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో మూడు టేబుల్ స్పూన్ల పాలు, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్, పావు స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని కాస్త మందంగా ముఖానికి అప్లై చేసుకోవాలి.ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.
అప్పుడు వాటర్‌తో శుభ్రంగా ఫేస్‌ను క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే గనుక మొటిమలు తాలూకు మచ్చలు క్రమంగా వదిలిపోతాయి.
మరియు చర్మం కాంతివంతంగా, షైనీగా కూడా మారుతుంది.కాబట్టి, ఎవరైతే మొటిమలు తాలూకు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారో.
వారు తప్పకుండా పైన చెప్పిన రెమెడీని ట్రై చేసేందుకు ప్రయత్నించండి.