మనం ప్రతి రోజు రాత్రి( Night ) నిద్రపోతున్నప్పుడు కలలు( Dreams ) సహజంగానే వస్తూ ఉంటాయి.ఉదయం నిద్ర లేవగానే ఎన్నో కలలను మరచిపోతూ ఉంటాము.
కానీ కొన్ని కలలు మాత్రం గుర్తొస్తూ ఉంటాయి.మనం రోజంతా ఆ కలల గురించి ఆలోచిస్తూనే ఉంటాము.
ఇలాంటి కల ఎందుకు వచ్చింది అంటూ కానీ అర్థం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కలల వెనుక దాగి ఉన్న అర్థం ఎవరు కనిపెట్టలేరు.
ఆ కలలు చాలా వరకు మనకు రాబోయే భవిష్యత్తు( future )కు సంకేతాలుగా నిలుస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది.

ఇక్కడ కొన్ని కలలకు సంబంధించిన అర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలో చెట్టు ఎక్కడం లేదా ఎత్తు ఎక్కినట్లు కనిపిస్తే అది భవిష్యత్తుకు శుభ సంకేతంగా పరిగణించవచ్చు.అలాగే మీ కెరియర్ లో పురోగతి సాధిస్తారని అర్థం చేసుకోవచ్చు.
రాబోయే రోజులలో మీ వ్యాపారం( Business ) లో కూడా లాభాలు వస్తాయి.ఇంకా చెప్పాలంటే కలలో ఆలయాన్ని చూడటం కూడా శుభ సంకేతమే.
స్వప్న శాస్త్రం ప్రకారం అలాంటి కల వస్తే మీ పై కుబేరుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే మీరు అపరమైన డబ్బుతో ధనవంతులవుతారు.ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి.అంతే కాకుండా మీ కలలో ఎవరైనా ఒక వ్యక్తిని స్మశాన వాటికలో దహనం చేయడాన్ని చూడడం చాలా శుభప్రదం అని పండితులు( Scholars ) చెబుతున్నారు.
ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూలతను దూరం చేస్తుందని స్వప్న శాస్త్రం చెబుతుంది.అలాగే కలలో చీమలు పాకడం చూస్తే మీ కుటుంబంలో ఐశ్వర్యంతో పాటు సంతోషం కూడా పెరుగుతుంది.
మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు కూడా తగ్గిపోతాయి.