సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు నిర్మాతల విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు.తమకు సంబంధించిన ప్రతి ఖర్చు నిర్మాతల అకౌంట్లలో వేస్తూ నిర్మాతలను ఇబ్బందులు పెడుతుంటారు.
హీరోలు హర్ట్ అయితే ఆ ప్రభావం సినిమా షూటింగ్ పై, రిజల్ట్ పై పడుతుందని నిర్మాతలు సైతం చాలా సందర్భాల్లో చూసీచూడనట్లు వ్యవహరించడం జరుగుతుంది.
అయితే చాలామంది హీరోలకు బాలయ్య( Balayya ) మాత్రం భిన్నం కావడం గమనార్హం.
వరుస సినిమాలు హిట్ అవుతున్నా బాలయ్య పారితోషికం( Balayya Remuneration ) ఎప్పుడూ పరిమితంగానే ఉంటుంది.సినిమా విషయంలో దర్శకునికి పూర్తి స్వేచ్ఛను ఇస్తారు.సినిమాకు సంబంధించి వృథా ఖర్చులు చేయడం బాలయ్యకు అస్సలు నచ్చదని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది.సినిమాకు ఎంత అవసరమో అంతే ఖర్చు చేయాలని బాలయ్య సూచిస్తారు.

బాలయ్య సినీ కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.ఆ సినిమాలలో కొన్ని సినిమాలలోని సన్నివేశాలకు సంబంధించి భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.అయితే బాలయ్య ఏరోజు ఏ దర్శకుడినీ నిందించలేదు.సినిమా హిట్టైతే తన క్రెడిట్ అని ఫ్లాప్ అయితే అందుకు వేరే వ్యక్తులు కారణమని ప్రచారం చేసుకోవడానికి బాలయ్య ఇష్టపడరు.
హీరోయిన్ల ఎంపిక విషయంలో కూడా బాలయ్య జోక్యం చేసుకోరు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి బాలయ్య లాంటి హీరోలు ఎంతో అవసరం అని చెప్పవచ్చు.సినిమాకు నష్టం వస్తే బాలయ్య నిర్మాతలను( Producers ) ఆదుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి.బాలయ్యలా మిగతా హీరోలు కూడా వ్యవహరిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలను నిర్మించడానికి మరి కొందరు నిర్మాతలు ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
బాలయ్యకు బాలయ్యే సాటి మరి కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు.బాలయ్య బాబీ మూవీ షూట్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ రావాల్సి ఉంది.