భూమిపై అత్యంత ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయి.వాటి జోలికి వెళ్తే ప్రాణాలతో ఆశలు వదిలేసుకోవాల్సిందే.
అయితే వాటిలో అత్యంత ప్రమాదమైనది ఒకటి ఉంది.అది ఐదు నిమిషాల్లోనే అలాంటి మనిషి ప్రాణాలైనా తీసేయగలదు.
దాని పేరు కోరియం.( Corium ) ఇది అణు విపత్తుల సమయంలో మాత్రమే ఏర్పడే ఒక విషపూరిత మిశ్రమం.
ఇది ద్రవించిన అణు ఇంధనం, యురేనియం, ప్లూటోనియం వంటి పదార్థాలతో కూడిన అగ్నిజ్వాలల ద్రవరాశిలా ఉంటుంది.అణు విద్యుత్ కేంద్రంలో పరిస్థితులు చాలా దిగజారితే ఈ ప్రాణాంతక మిశ్రమం ఏర్పడుతుంది.
చరిత్రలో కేవలం కొన్ని సార్లు మాత్రమే ప్రమాదవశాత్తు రేడియోయాక్టివ్ మెటీరియల్( Radioactive Material ) కోరియం ఏర్పడింది.మొదటిసారి 1979లో అమెరికాలోని థ్రీ మైల్ ఐలాండ్( Three Mile Island ) ప్లాంట్‌లో, 1986లో ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ ప్లాంట్‌లో,( Chernobyl ) 2011లో జపాన్‌లోని ఫుకుషిమా డైచి ప్లాంట్‌లో భారీ భూకంపం, సునామి తర్వాత మూడుసార్లు ఇది ఏర్పడింది.

చెర్నోబిల్ విపత్తు జరిగిన కొన్ని నెలల తర్వాత, ప్రమాద కేంద్రంలోని రియాక్టర్ నంబర్ 4 కింద ఉన్న ఒక గనిలో ఒక భారీ, ద్రవరాశిని కనుగొన్నారు.దాని రూపం ఏనుగు పాదంలా ఉండటం వల్ల దీనికి “ఏనుగు పాదం” అనే పేరు వచ్చింది.ఈ ద్రవరాశి చాలా రేడియోధార్మికంగా, వేడిగా ఉండటం వల్ల సిమెంట్ కూడా కరిగిపోయింది.ఏనుగు పాదం ఒక భయంకరమైన హెచ్చరిక.అణు విపత్తు( Nuclear Accidents ) ఎంత ప్రమాదకరమో దీని ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.

రేడియేషన్ వ్యాప్తిని నిరోధించడానికి, రియాక్టర్ చుట్టూ “సర్కోఫాగస్” అనే ఒక భారీ కవచం నిర్మించారు.దీని ద్వారా రేడియేషన్ బయటకు రాకుండా నిరోధించాలని లక్ష్యం.కోరియం చాలా ప్రమాదకరమైనది, దీనిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.
దీనిని చల్లబరచడం, గట్టిపరచడం ముఖ్యం.శాస్త్రవేత్తలు కోరియంను తక్కువ యాక్టివ్‌గా మార్చడానికి మార్గాలను కనుగొన్నారు.