చెప్పుతో రిపోర్ట‌ర్ చెంప‌లు ప‌గ‌ల‌గొట్టిన అల‌నాటి మేటిన‌టి!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సావిత్రి త‌ర్వాత మ‌ళ్లీ అంత పేరు తెచ్చుకున్న న‌టి వాణిశ్రీ‌.ఆమె చేసిన‌న్ని విభిన్న క్యారెక్ట‌ర్లు.అప్పుడూ ఇప్పుడూ మ‌రెవ‌రూ చేయ‌లేదు.అల‌నాటి తెలుగు సినిమాల‌ను న‌వ‌ల‌లు రాజ్య‌మేలుతున్న స‌మ‌యంలో అందులోని హీరోయిన్ క్యారెక్ట‌ర్.వాణిశ్రీ‌నే దృష్టిలో పెట్టుకుని సృష్టిస్తున్నారేమో అనేలా ఉండేది.ఆయా క్యారెక్ట‌ర్ల‌లో వాణిశ్రీ ప‌ర‌కాయ ప్రవేశం చేసి మరీ న‌టించేవారు.

 Untold Facts Tollywood Actress Vanisri , Vanisri ,heroine Vanisri Movies, Vanisr-TeluguStop.com

ఆమె న‌ట‌న అంటే ఆ కాలం గృహిణులు, యువ‌కులు ఎంతో ఇష్ట‌ప‌డేవారు.ఆమె డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నాటి మ‌హిళ‌లు ఎంతో మంది ఫాలో అయ్యేవారు.

చిన్న చిన్న క్యారెక్ట‌ర్ల‌తో సినిమాలు ప్రారంభించిన ఆమె.త‌న అస‌మాన న‌ట‌న‌తో తెలుగు సినీ ఇండ‌స్ట్రీని ఏలారు.

వాణిశ్రీ అస‌లు పేరు ర‌త్న‌కుమారి.నెల్లూరులో 9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివారు.ఆ త‌ర్వాత ఆమె కుటుంబం మ‌ద్రాసుకు వెళ్లింది.చిన్న‌ప్ప‌టి నుంచి ఆమెకు ల‌లిత క‌ళ‌ల మీద ఇష్టం ఎక్కువ‌.

మ‌ద్రాసు ఆంధ్ర‌మ‌హా స‌భ‌లో మెట్రిక్యులేష‌న్ పూర్తి చేసింది.న‌ల్ల‌గా ఉండ‌టం మూలంగా మేక‌ప్ ఎక్కువ‌గా వేసుకునేవారు.

సుమారు 3 గంట‌ల స‌మ‌యం దీనికే కేటాయించేవారు.

అటు సినీ గాసిప్స్ ఇప్పుడే కాదు.

అప్ప‌ట్లోనూ ఉండేవి.ఇప్పుడు వెబ్ సైట్స్ ఆ వార్త‌లు రాస్తుంటే అప్పుడు కొన్ని ప‌త్రిక‌లు రాసేవి.

అలాంటిదే నెల్లూరు నుంచి ప్ర‌చురితం అయ్యే ఒగ్గుశ్రీ ప‌త్రిక‌.ఈ ప‌త్రిక‌లో ఎన్నో సినీ గాసిప్స్ రాసేవాళ్లు.

అయితే ఒక్కోసారి సినీ న‌టుల వ్య‌క్తిగ‌త జీవితాల గురించి రాసేవాళ్లు.కొన్నిసార్లు ఈ వార్తలు మ‌రింత అస‌హ్యంగా ఉండేవి.

లేనివి ఉన్న‌ట్లు రాసేవాళ్లు.అలాంటి వార్త‌లే వాణిశ్రీ గురించి రాసేవాళ్లు.

మొద‌ట్లో ఆ వార్త‌లు చూసి న‌వ్వి ఊరుకునేవారు వాణిశ్రీ‌.ఓసారి త‌న‌తో పాటు త‌న చెల్లి, త‌ల్లి గురించి అడ్డ‌గోలుగా వార్త‌లు ప్ర‌చురించారు.

ఆమెకు తీవ్ర ఆగ్ర‌హం క‌లిగింది.ఈ ఘ‌ట‌న జ‌రిగిన కొద్దిరోజుల‌కే ఒగ్గుశ్రీ ప‌త్రిక నుంచి వాణిశ్రీ‌కి ఓ కాల్ వ‌చ్చింది.

ఆయా న‌టీ న‌టులు త‌మ గురించి చెడుగా రాయ‌కుండా ఉండేందుకు 10 వేల రూపాయ‌ల చొప్పున ఇస్తున్నార‌ని.మీరు టాప్ హీరోయిన్ కాబ‌ట్టి 50 వేలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

కోపం క‌ట్ట‌లు తెంచుకున్నా.స‌ముదాయించుకుని.

రేపు షూటింగ్ స్పాట్‌కి ర‌మ్మ‌ని చెప్పారు.

Telugu Actressvanisri, Vanisri, Untoldtollywood, Vanisri Slaps-Telugu Stop Exclu

మ‌రుస‌టి రోజు ఒగ్గుశ్రీ ప‌త్రిక రిపోర్ట‌ర్ స్పాట్‌కు వ‌చ్చారు.వెంట‌నే ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ త‌న‌ను వాణిశ్రీ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాడు.తొలుత నీకు అక్కా చెల్లెళ్లు, త‌ల్లిదండ్రులు లేరా? మీ అక్కాచెల్లెళ్ల గురించి ఇలాగే రాస్తావా? అంటూ మండిప‌డింది.అలాగే రాస్తానంటూ స‌ద‌రు ప‌త్రిక రిపోర్టర్ చెప్ప‌డంతో ఆమెకు మ‌రింత కోపం వ‌చ్చింది.చెప్పు తీసుకుని స‌ద‌రు రిపోర్ట్ చెంప‌లు వాయించింది.అక్క‌డున్న వాళ్లు జోక్యం చేసుకోవ‌డంతో అక్క‌డి నుంచి రిపోర్ట‌ర్ పారిపోయాడు.అప్ప‌టి నుంచి ఆమె గురించి వార్త‌లు రాయాంటేనే ప‌త్రిక‌లు భ‌య‌ప‌డేవి అంటారు సినీ జ‌నాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube