ఈరోజుల్లో చాలామంది తమ లైఫ్ పార్ట్‌నర్‌ను కనుగొనడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లనే ఉపయోగిస్తున్నారు.దీంతో ఆన్‌లైన్ డేటింగ్, మ్యాచ్‌మేకింగ్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది.
కానీ, ఈ మార్పుతో పాటు ఈ ఇండస్ట్రీలో మోసాల సంఖ్య కూడా పెరిగింది.ముఖ్యంగా చైనాలో( China ) ఈ సమస్య తీవ్రంగా ఉంది.
అక్కడ మ్యాచ్‌మేకింగ్ సర్వీసుల ద్వారా ఒంటరి పురుషులను లక్ష్యంగా చేసుకుని అనేక మోసాలు జరుగుతున్నాయి.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, దక్షిణ చైనాలోని పోలీసులు మ్యాచ్‌మేకింగ్ కంపెనీలపై మోసాల ఆరోపణలపై( Matchmaking Fraud ) దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సంస్థలు మహిళలను హైట్ చేసుకుంటూ బ్యాచిలర్స్ కి వారిని అంటగడుతున్నారు.ఆ మహిళలు మగవారిని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటారు కాపురం చేయడానికి కాదు.
నిజంగా ప్రేమ ఉన్నట్టు నటిస్తూ వారిని పెళ్లి చేసుకొని తర్వాత వదిలేస్తారు.ఇలా ఈ మహిళలు ఎంతోమందిని మోసం చేయడం ద్వారా 3 నెలల్లో 300,000 యువాన్లు (సుమారు రూ.35 లక్షలు) వరకు సంపాదించారు.
చైనాలోని గుయయాంగ్ నగరంలోని( Guiyang ) హువాగుయోయువాన్( Huaguoyuan ) ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు వివాహ మోసాలకు సంబంధించి 180 ఫిర్యాదులు అందాయి.ఈ మోసాలన్నీ ఒకే విధంగా జరుగుతున్నాయి.మ్యాచ్‌మేకింగ్ ఏజెంట్లు పరిచయం చేసిన కొద్ది రోజులకే పెళ్లి చేసుకోవాలని వరులను ఒప్పిస్తారు.
ఈ విధమైన వివాహాలను ‘ఫ్లాష్’ వివాహాలు( Flash Marriages ) అంటారు.
ఈ విధంగా పెళ్లి చేసుకోవాలంటే వరుడు ఏజెంట్‌కు భారీగా డబ్బు చెల్లించాలి.ఆ తర్వాత పెళ్లి జరిగిన కొద్ది రోజులకే వధువులు అదృశ్యమవుతున్నారు, లేదా కొన్ని కారణాలతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.కొన్ని సందర్భాల్లో వారు ఉద్దేశపూర్వకంగా గొడవలు చేసి విడాకులు తీసుకుంటున్నారు.
ఈ విధంగా వరులు లక్షల రూపాయలు నష్టపోతున్నారు.రోజూ ఈ ఏజెంట్లు 40 నుంచి 50 మంది వరులను చాలా తేలికగా కనుగొంటున్నారట.
పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో కొంతమంది ఏజెంట్లు యున్నాన్ ప్రాంతానికి తరలివెళ్లి ఈ మోసాలను కొనసాగిస్తున్నారు.