బంగాళదుంప.( Potato ) దాదాపు అందరి ఇంట్లోనూ విరివిగా ఉపయోగించే కూరగాయాల్లో ఒకటి.
బంగాళదుంపతో స్నాక్స్ నుంచి కర్రీస్ వరకు ఎన్నో రకాల వంటకాలను వండుతుంటారు.అయితే వంటింట్లో ఉండే బంగాళదుంపతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్నది పక్కన పెడితే.
అనేక చర్మ సమస్యలు( Skin Problems ) దూరం చేయడానికి మాత్రం బంగాళదుంప చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
మొటిమలు, మచ్చల నివారణకు మూడు టేబుల్ స్పూన్లు పొటాటో జ్యూస్ లో వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్,( Lemon Juice ) వన్ టీ స్పూన్ హనీ( Honey ) మిక్స్ చేసి ముఖానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.
పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఇలా చేశారంటే ఎలాంటి మొటిమలు, మచ్చలు అయినా పరారవుతాయి.పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది.స్కిన్ కలర్ ఈవెన్ గా మారుతుంది.
చర్మాన్ని కాంతివంతంగా మెరిపించుకోవాలి అనుకుంటే పీల్ తొలగించిన కొన్ని బంగాళదుంప ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, వన్ టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
బంగాళదుంప మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి మరియు తేమగా ఉంచడానికి సహాయపడుతుంది.అందుకోసం మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ లో మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బంగాళదుంప జ్యూస్, హాఫ్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మంచి క్రీమ్ రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను రోజు నైట్ ముఖానికి మెడకు అప్లై చేసుకుంటే స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది.
ప్రస్తుత చలికాలంలో ఈ క్రీమ్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.