సాధారణంగా చాలా మంది చలికాలంలో మలబద్ధకం( Constipation ) సమస్యను ఎదుర్కొంటారు.అయితే కొన్ని కొన్ని ఆహారాలు ఈ సమస్యను మరింత ఉధృతం చేస్తాయి.
అలాంటి ఆహారాల జాబితాలో ప్రాసెస్డ్ ఫుడ్స్( Processed Foods ) ముందు వరుసలో ఉంటాయి.ప్యాకెట్ స్నాక్స్, చిప్స్, వైట్ బ్రెడ్, వైట్ రైస్ తదితర ప్రాసెస్డ్ ఫుడ్స్ లో పిండి మరియు చక్కెర ఎక్కువగా ఉంటాయి.
అవి జీర్ణక్రియను నెమ్మదించేలా చేసి మలబద్ధకం సమస్యకు దారితీస్తాయి.
అలాగే చక్కెర( Sugar ) అధికంగా ఉండే కేకులు, బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్స్ మరియు మైదాతో చేసిన పిండి వంటలు జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి.
మలబద్ధకాన్ని మరింత తీవ్రంగా మారుస్తాయి.ఎక్కువ కెఫిన్( Caffeine ) కలిగిన పానీయాలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి.ఫలితంగా మలబద్ధకం ఎక్కువ అవుతుంది.అందువల్ల చలికాలంలో టీ మరియు కాఫీలను ఎంత లిమిట్ గా తీసుకుంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఉప్పు ఎక్కువగా ఉన్న స్నాక్స్, రోస్టెడ్ ఆహారాలు, తీవ్రమైన కారం కలిగిన ఆహారాలు, మసాలా ఫుడ్స్, రెడ్ మీట్ జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని పెంచి మలబద్ధకానికి కారణం అవుతాయి.అందుకే చలికాలంలో( Winter ) ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది.ఇక మలబద్ధకం సమస్య నుంచి బయటపడటానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోండి.ఆకుకూరలు, చిలగడదుంపలు, మొక్కజొన్న, అరటి పండు, యాపిల్, గుమ్మడికాయ, బీట్ రూట్, క్యారెట్, గోధుమ రొట్టెలు, ఓట్స్ లో ఫైబర్ మెండుగా ఉంటాయి.
రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగండి.కొబ్బరి నీరు, నిమ్మరసం లాంటి ద్రవాలు తాగడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది.నిత్యం నడక, యోగా లేదా ఏదైనా శారీరక వ్యాయామం చేయండి.తద్వారా జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది.మలబద్ధకం దూరం అవుతుంది.రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసం మరియు తేనె కలిపి తాగండి.
లేదా ఏదైనా హెర్బల్ టీను తీసుకోండి.మలబద్ధకాన్ని దూరంలో ఇటువంటి పానీయాలు అద్భుతంగా సహాయపడతాయి.