ఉల్లిపాయలను తరిగేటప్పుడు వచ్చే కన్నీళ్లు ఇతర కూరగాయలను తరిగినప్పుడు రావు.ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఉల్లిపాయలను తరిగేటప్పుడు ఏడుపొస్తుంది.కానీ చెఫ్ తరిగేటప్పుడు అలా జరగదు.దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది.ఉల్లిపాయలలో ఉండే రసాయనమే దీనికి ప్రధాన కారణం.దీనిని ప్రొప్రెయిన్ ఎస్ ఆక్సైడ్ అని పిలుస్తారు.
ఉల్లిపాయ కట్ చేసినప్పుడు ఇది కళ్ళలో ఉన్న సున్నల్ గ్రంధిని ప్రేరేపిస్తుంది.ఫలితంగా కన్నీళ్లు వస్తాయి.
ఉల్లిపాయలను కట్ చేసేటప్పుడు కన్నీరు రాకూడదంటే దానిని కట్ చేసే పద్ధతిని మార్చవలసి ఉంటుంది.చెఫ్ ఉల్లిపాయలను కట్ చేసేటప్పుడు చాలా పదునైన చాకును ఉపయోగిస్తారు.
ఉల్లిపాయలు తరిగేటప్పుడు కన్నీరు రాకూదనుకుంటే మరొక ఉపాయం కూడా ఉంది.ఉల్లిపాయలను నీటిలో కాసేపు ఉంచాక, బయటకు తీసి, తరగాల్సి వుంటుంది.
ఇలా చేయడం వలన ఉల్లిపాయలోని సల్ఫ్యూరిక్ సమ్మేళనం నీటిలోనికి చేరుకుంటుంది.నీటిలో 20 నిమిషాలు ఉంచి, తరువాత ఉల్లిపాయలను కట్‌చేస్తే కన్నీళ్లు రావు.
ఇదేవిధంగా ఉల్లిపాయలను కట్ చేసేముందు 15 నిమిషాలు ఫ్రీజ్‌లో ఉంచండి.ఈ తరువాత వాటిని కట్ చేస్తే కన్నీళ్లు రావు.
ఉల్లిపాయలను శుభ్రంగా కడిగిన తరువాతే వినియోగించాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.

లేనిపక్షంలో సాల్మొనెల్లా ఇన్‌ఫెక్షన్ వస్తుందని హెచ్చరిస్తున్నారు.ఇది టైఫాయిడ్‌కు కారణం కావచ్చని చెబుతున్నారు.పచ్చి ఉల్లిపాయలను అధికంగా తీసుకుంటే వాంతులు, వికారం, కడుపులో నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు.
అలాగే గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుంది.కొందరికి అపానవాయువు అధికమవుతుంది.
కడుపులో నొప్పి, గుండెల్లో మంట లక్షణాలు కూడా కనిపిస్తాయి.