ప్రేమకు భాష లేదు, హద్దులు లేవు (Love has no language, no boundaries)అంటారు.ఇది అక్షరాలా నిజమని నిరూపిస్తోంది ఈ జంట కథ.అమెరికాకు చెందిన ఓ యువతి, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మారుమూల పల్లెటూరుకు చెందిన యువకుడు వేల మైళ్ల దూరం, విభిన్న సంస్కృతులు ఉన్నా ఒక్కటయ్యారు.వీరి ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికాకు చెందిన జాక్లిన్ ఫోరెరో(Jacqueline Forero from America) ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్.ఆమెకు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో(Chandanku on Instagram) పరిచయం ఏర్పడింది.మొదట్లో మామూలుగా మెసేజ్‌లు పంపుకున్న వీరు.ఆ తర్వాత లోతైన విషయాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
అలా రోజులు గడిచే కొద్దీ.వీడియో కాల్స్‌లో గంటల తరబడి ముచ్చటించుకునేంత చనువు పెరిగిపోయింది.
ఏకంగా 14 నెలలు ఆన్‌లైన్‌లోనే చాటింగ్, వీడియో కాల్స్‌తో తమ బంధాన్ని కొనసాగించారు.
ఇక లాభం లేదు అనుకున్నారో ఏమో, చివరకు నేరుగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
దాంతో జాక్లిన్ అమెరికా నుంచి ఇండియాకు(Jacqueline from America to India) ఫ్లైట్ ఎక్కి చందన్‌ను చూడటానికి వచ్చేసింది.వాళ్లిద్దరూ కలిసిన ఆ ఎమోషనల్ మూమెంట్స్‌ను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram)పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది.”14 నెలలు కలిసి ఉన్నాం.ఇకపై మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది” అంటూ జాక్లిన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
అంతేకాదు.చందన్ కంటే తను తొమ్మిదేళ్లు పెద్ద అని కూడా చెప్పింది.
వయసులో అంత తేడా ఉన్నా.వాళ్ల ప్రేమ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
వీడియోలో వాళ్లు వీడియో కాల్స్‌లో మాట్లాడుకున్న క్లిప్స్, మొదటిసారి కలుసుకున్నప్పుడు ఎమోషనల్ అయిన దృశ్యాలు ఉన్నాయి.ఈ లవ్ స్టోరీ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు.కామెంట్స్ సెక్షన్‌లో వాళ్లకి బెస్ట్ విషెస్ చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.“మా కథ కూడా ఇలానే మొదలైంది.మేము కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోనే కలుసుకున్నాం.ఏడు నెలల తర్వాత నేను ఇండియాకు వెళ్లి అతన్ని పెళ్లి చేసుకున్నాను.అది జరిగి మూడున్నర సంవత్సరాలు అయింది.” అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.“వీళ్లిద్దరూ చాలా అందంగా ఉన్నారు” అని మరొకరు కామెంట్ చేశారు.
“నేను ప్రొఫెషనల్ హేటర్‌ని, కానీ ఈ జంటను మాత్రం ద్వేషించలేకపోతున్నా, టూ క్యూట్.” అంటూ ఇంకొకరు ఫన్నీగా కామెంట్ పెట్టారు.చందన్ కళ్లలో ఏదో దయ ఉందంటూ, “చందన్ చాలా మంచి వ్యక్తిలా కనిపిస్తున్నాడు” అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
జాక్లిన్, చందన్ (Jacqueline, Chandan)కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు.వాళ్ల ఛానల్ బయోలో తమ లవ్ స్టోరీ గురించి “విడాకులు తీసుకున్న క్రిస్టియన్ మదర్, దేవుడిపై నమ్మకం ఉన్న ప్రేమ కోసం వెతుకుతుండగా, ఇండియాలోని ఒక చిన్న పల్లెటూరుకు చెందిన యంగ్ మ్యాన్ పరిచయమయ్యాడు.
వయసు, జాతి, మతం, ఆర్థిక పరిస్థితులు ఇలా చాలా విషయాల్లో వీళ్ల బంధం సాంప్రదాయాలను బ్రేక్ చేసింది.కానీ నిజమైన ప్రేమకు హద్దులు లేవని నిరూపించింది” అని రాసుకున్నారు.
జాక్లిన్, చందన్ లవ్ స్టోరీ చూస్తుంటే, నిజంగానే ప్రేమకు దూరం, హద్దులు లేవనిపిస్తోంది.