కెనడా ప్రభుత్వం(Government of Canada) దేశంలోని ప్రైవేట్ రంగ కార్మికులకు శుభవార్త చెప్పింది.ఈ మేరకు ఫెడరల్ కనీస వేతన రేటును పెంచగా ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.
దీని వల్ల బ్యాంకింగ్, ఇంటర్ ప్రావిన్షియల్ ట్రాన్స్‌పోర్ట్, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీతో సహా కెనడాలోని సమాఖ్య నియంత్రిత రంగాలలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ వలసదారులకు ముఖ్యంగా భారతీయ విద్యార్ధులు, నిపుణులకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కనీస వేతనాన్ని గంటలకు 17.30 కెనడియన్ డాలర్ల (Canadian dollars)నుంచి 2.4 శాతం పెంచి 17.75 కెనడియన్ డాలర్లకు తీసుకొచ్చింది.ఇది కెనడా వార్షిక వినియోగదారుల ధరల సూచికలో ఒక భాగం.
ప్రతి ఏడాది ఏప్రిల్ 1న మునుపటి ఏడాది క్యాలెండర్ ఇయర్‌తో పోల్చి ఫెడరల్ కనీస వేతన రేటును సర్దుబాటు చేస్తుంది.ఫెడరల్ కనీస వేతనం కెనడియన్ కార్మికులకు , వ్యాపారాలకు స్థిరత్వం, ఖచ్చితత్వాన్ని తెస్తుంది.
బోర్డ్ అంతటా ఆదాయ అసమానతను తగ్గించడంలో సహాయపడుతుంది.ఈ పెంపు న్యాయమైన ఆర్ధిక వ్యవస్ధను నిర్మించడానికి మమ్మల్ని ఒక అడుగు ముందుకు తీసుకొస్తుందని కెనడా ఉపాధి , శ్రామిక శక్తి అభివృద్ధి, కార్మిక మంత్రి స్టీవెన్ మాకిన్నన్(Labour Minister Steven MacKinnon) పేర్కొన్నారు.

ఈ మార్పు కెనడియన్ పౌరులకు(Canadian citizens) , వలసదారులకు వర్తిస్తుందని యజమానులు కొత్త రేటును ప్రతిబింబించేలా వారి పేరోల్ వ్యవస్ధలను ఆధునీకరించాలని , ఇంటర్న్‌లతో సహా అన్ని ఉద్యోగులు అప్‌గ్రేడ్ చేసిన జీతాలను పొందేలా చూసుకోవాలని ఆయన కోరారు.ఈ 45 శాతం పెరుగుదల.సమాఖ్య నియంత్రిత రంగాలలోని సుమారు 26 వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.వేతనాలు ద్రవ్యోల్భణానికి అనుగుణం ఉండేలా చూసుకోవడానికి కెనడా చేస్తున్న ప్రయత్నాలలో ఇది బాగం.
ఇది ఏళ్లుగా పెరుగుతోంది.జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి విమర్శలు తీసుకొచ్చిన అంశాల్లో ద్రవ్యోల్బణం కూడా ఒకటి.2025 కెనడా ఫెడరల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ఇది ఆయుధంగా నిలిచింది.