సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అజిత్ కుమార్‌కి( Ajith Kumar ) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన మాస్ అప్పీల్, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, అభిమానుల ప్రేమతో తమిళ చిత్రపరిశ్రమలో ఆయన ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.
అజిత్ సినిమాల రిలీజ్ అంటే అభిమానులకు పండుగే.అలాంటి అజిత్ తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’( Good Bad Ugly ) ఈరోజు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
ఆథిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజిత్‌తో పాటు త్రిష, ప్రియా ప్రకాష్ వారియర్, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్ వంటి ప్రముఖ నటులు నటించారు.భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.
ఈ బ్యానర్ తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.సంగీతాన్ని జివి ప్రకాష్ కుమార్ అందించారు.

ఇకపోతే, అజిత్ చివరి సినిమా ‘విడాముయార్చి’ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది.దీంతో నిరాశ చెందిన అభిమానులకు మళ్లీ ఆనందాన్ని ఇచ్చే సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’.మాస్ మాసాలా ఎలిమెంట్స్‌తో నిండిన ఈ చిత్రం అభిమానులకు పండుగ విందుగా మారింది.అజిత్ కెరీర్‌లో ఇది మరో మంచి కమ్‌బ్యాక్ మూవీగా నిలుస్తుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు.
ఈ సినిమాకి తమిళనాడులో ఉదయం 9 గంటలకు తొలి షో బెయడం జరిగింది.అయితే, అంతకు ముందే విదేశాల్లో ప్రీమియర్ షోలు మొదలవ్వగా.అక్కడి నుండి వచ్చిన రెస్పాన్స్ ప్రకారం, సినిమా పూర్తిగా మాస్ ప్రేక్షకుల్ని ఉద్దేశించిందేనని, అజిత్ అభిమానులు పండగలా ఎంజాయ్ చేసుకుంటారని తేలింది.

ఇక నేడు చెన్నైలోని రోహిణి థియేటర్( Rohini Theatre ) వంటి ప్రముఖ థియేటర్లలో అభిమానులు సినిమా కోసం డాన్స్‌లు చేస్తూ, బ్యానర్‌లకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.మాస్ సీన్స్ చూసి అభిమానులు ఉత్సాహంగా కేకలు వేస్తారని అంచనా వేసిన ఫ్యాన్స్, గొంతు ఎండిపోకుండా చూడటానికి హాల్స్, విక్స్ లను ప్రతి సీటులో ఉంచారు అజిత్ అభిమానులు.ఈ వినూత్న చర్యకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అజిత్ అభిమానులు( Ajith Fans ) తమ హీరో సినిమాను పండుగలా చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు.‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విడుదలను కూడా అదే ఉత్సాహంతో జరుపుకున్నారు.సినిమా విడుదల రోజు అభిమానులు తీసుకున్న ఈ జాగ్రత్తలు, వారు అజిత్‌కి చూపించే ప్రేమను మరోసారి నిరూపించాయి.ఈ మాస్ అద్భుతం ప్రేక్షకులను ఎంతగా అలరించి, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి మరి.