మనం ప్రకృతికి ఎంత దూరంగా వెళుతూ ఉంటే అనారోగ్య సమస్యలకు అంత దగ్గరగా వెళుతూ ఉంటాం.ఇందుకు మంచి ఉదాహరణ విటమిన్ డి ( Vitamin D )(లోపం.
ఎత్తైన అపార్ట్ మెంట్ ఫ్లాట్లలో ఎండ తగలకుండా తలుపు మూసుకుని ఉండే కల్చర్లతో పాటు విటమిన్ డి లోపం కూడా పెరిగిపోతుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.కానీ దీని లోపం రక్తం లో ఒక రకమైన పీడనాన్ని గుండె జబ్బుల రిస్కును కూడా పెంచుతుందని ఇటివల ఒక అధ్యయనంలో తేలింది.
ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కూడా విటమిన్ డి తగినంత ఉండడం ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

సూర్య రష్మీ ద్వారా లభించే విటమిన్ డి కి సంబంధించిన ఈ అధ్యాయనం యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచూరితమైంది.విటమిన్ డి లోపం వల్ల గుండెపోటు పెరిగి గుండె రక్తనాళాల వ్యాధుల రిస్కు పెరుగుతుంది.అందుకే ఒక వ్యక్తిలో డి విటమిన్ స్థాయిలను బట్టి కార్డియో వాస్కులర్ రిస్కు ఏ మేరకు ఉందో అంచనా వేయొచ్చని సౌత్ ఆస్ట్రేలియా కాన్సర్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు చెబుతున్నారు.
జీవరాసాయన చర్యలు రక్త పోటును రెగ్యులర్ చేస్తాయి.శరీరంలో తగినంత విటమిన్ డి ఉంటే ఈ జీవ రసాయన చర్యలు సక్రమంగా జరిగి సాధరణ రక్తపోటు మెయింటైన్ ( Maintain blood pressure )అవుతుందని గురుగ్రామ్ లోని మణిపాల్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ వెల్లడించారు.

ఇంకా చెప్పాలంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలలో తక్కువ మోతాదులో అవసరమైన మైక్రో న్యూక్లియన్స్ విటమిన్లు.కొవ్వులో కరిగే విటమిన్ డి2, డి3 అని రెండు రకాలుగా ఉంటుంది.ఇది ప్రధానంగా సూర్య రష్మీ నుంచి వచ్చిన కొన్ని రకాల ఆహార పదార్థాలలో కూడా దొరుకుతుంది.దంతాలు, ఎముకల పెరుగుదలకు, అవి బలంగా ఉండడానికి విటమిన్ డి ఎంతగానో ఉపయోగపడుతుంది.
వీటి ఎదుగుదలకు తోడ్పడే క్యాల్షియం శరీరానికి ఉపయోగపడాలంటే విటమిన్ డి అవసరమవుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ( Immune system ) శక్తివంతంగా పనిచేయడానికి కూడా విటమిన్ డి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇది తగినంత శరీరంలో లేనప్పుడు సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాల్సి వస్తుంది
.