సీజన్ మారుతుంది.సీజన్ మారగానే కొన్ని ఆరోగ్య సమస్యలు రావటం సహజమే.
ఆ ఆరోగ్య సమస్యల్లో విరేచనాలు ఒకటి.విరేచనాల కారణంగా శరీరంలోని నీరు అంతా బయటకు పోయి డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.
ఈ సమస్యలు రాకుండా విరేచనాల సమస్య ఉన్నప్పుడు ఈ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.
నీళ్ల విరేచనాలు ఏర్పడినప్పుడు రోజులో మూడు సార్లు గడ్డ పెరుగు తినాలి.
గడ్డ పెరుగులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ విరేచనాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్,అరస్పూన్ తేనే వేసి బాగా కలిపి త్రాగాలి.
విరేచనాలు తగ్గే వరకు రోజులో ఈ పానీయాన్ని రెండు నుంచి మూడు సార్లు త్రాగుతూ ఉండాలి.
బాగా పండిన అరటిపండును రోజులో రెండు సార్లు తినాలి.అరటిపండులో ఉండే పోషకాలు విరేచనాలను తగ్గించేందుకు సహాయపడతాయి.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ పసుపును వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తాగుతుంటే ఫలితం ఉంటుంది.
లేదంటే 1 టేబుల్ స్పూన్ పెరుగులో 1 టీస్పూన్ పసుపును వేసి తింటున్నా విరేచనాలను తగ్గించుకోవచ్చు.
ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ అల్లం మిశ్రమాన్ని వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.
ఈ నీటిని వడకట్టి త్రాగుతూ ఉంటే క్రమంగా విరేచనాలు తగ్గిపోతాయి.
ఎండిన అల్లం పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి కొద్దిగా, దాల్చిన చెక్క పొడి, తేనెలను కొంత మొత్తంలో తీసుకుని అన్నింటినీ బాగా కలిపి తింటున్నా విరేచనాలు కట్టుకుంటాయి.