టూరిజానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే థాయ్‌లాండ్‌లో ఓ బ్రిటీష్ టూరిస్ట్ (British tourist in Thailand)వీరంగం సృష్టించాడు.జార్జ్ ప్యాటర్సన్ అనే 40 ఏళ్ల బ్రిటీష్ వ్యక్తి ఫుకెట్‌లోని ఓ షాపు యజమానిని దారుణంగా కొట్టి అరెస్టయ్యాడు.
ఈ ఘటన ఏప్రిల్ 4వ తేదీ తెల్లవారుజామున చలాంగ్ ప్రాంతంలో జరిగింది.దీనికి సంబంధించిన
సీసీటీవీ ఫుటేజ్
(CCTV footage)సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్కాట్లాండ్‌లోని గ్లాస్గోకు చెందిన జార్జ్ ప్యాటర్సన్ (George Patterson)ఓ చిన్న కిరాణా షాపు ముందు పార్క్ చేసిన మోటార్‌సైకిల్‌ను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు.సీసీటీవీ ఫుటేజ్‌లో అతను బైక్ సీటును పీకేయడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు.
ఇది గమనించిన 51 ఏళ్ల షాపు యజమాని వారిన్ డాక్‌బువా అడ్డుకునేందుకు రాగా, ప్యాటర్సన్ మరింత రెచ్చిపోయాడు.
శాంతించాల్సింది పోయి, ప్యాటర్సన్ మరింత హింసాత్మకంగా ప్రవర్తించాడు.
వారిన్‌ను పదే పదే పిడిగుద్దులు గుద్దాడు.ఆ తర్వాత రెండు గాజు సీసాలు తీసుకుని అతనిపై విసిరాడు.“అతను మద్యం మత్తులో లేదా డ్రగ్స్(Drugs) తీసుకుని ఉండొచ్చు.నేను అతన్ని మాట్లాడటానికి ప్రయత్నించాను, కానీ అతను వినలేదు.
నన్ను కొట్టాడు, నూనె బాటిల్‌ను కూడా నాపై విసిరాడు” అని వారిన్ వాపోయాడు.

అంతటితో ఆగకుండా మరింత దారుణానికి ఒడిగట్టాడు ప్యాటర్సన్.స్కూటర్‌పై ముగ్గురు పిల్లలతో వచ్చిన ఓ మహిళపై కూడా దాడి చేశాడు.సీసీటీవీ ఫుటేజ్(CCTV footage) ప్రకారం, ప్యాటర్సన్ ఆ మహిళతో పాటు ఉన్న టీనేజ్ కుర్రాడిని కిందకు తోసేశాడు.
అంతేకాదు, మహిళను తోసివేయడంతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు స్కూటర్ నుండి కిందపడిపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్యాటర్సన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ప్యాటర్సన్ చాలా కోపంగా, హింసాత్మకంగా ఉండటంతో వెంటనే విచారించలేకపోయామని పోలీసులు తెలిపారు.ప్రస్తుతం అతడు పోలీసు కస్టడీలో ఉన్నాడు.

థాయ్‌లాండ్‌లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న బ్రిటీష్ ఎక్స్‌పాట్‌ల(British expats) జీవితానికి, ప్యాటర్సన్ చర్యలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.2023 నుండి కోహ్ సముయ్‌లో నివసిస్తున్న క్లాడియా అనే బ్రిటీష్ కంటెంట్ క్రియేటర్ థాయ్‌లాండ్‌లో తన సంతోషకరమైన అనుభవాలను తరచుగా పంచుకుంటుంది.వెచ్చని వాతావరణం, స్నేహపూర్వక ప్రజలు, సరసమైన జీవనశైలి తనకు ఎంతో నచ్చాయని ఆమె చెబుతోంది.ప్యాటర్సన్ చర్యలు, ఇతర ఎక్స్‌పాట్‌ల సానుకూల అనుభవాల మధ్య ఉన్న తేడా చాలా మందిని షాక్‌కు గురిచేసింది.ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.https://youtube.com/shorts/gz5AtzUOcR4?si=wcAeMnhMQcojkwYV ఈ లింకు మీద క్లిక్ చేసి వీడియో చూడవచ్చు.