యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) ఒక పాట మినహా వార్2 సినిమా షూటింగ్ ను పూర్తి చేయగా ఈ ఏడాది ఆగష్టు నెలలో వార్2 సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.ఈ నెల 22వ తేదీ నుంచి తారక్ ప్రశాంత్ నీల్( Prashant Neel ) డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ తాజాగా గాయాల పాలై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రముఖ రాజకీయ నాయకులు కామెంట్లు చేశారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పోస్ట్ పెట్టారు.
సింగపూర్( Singapore ) లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడని తెలిసి బాధ పడ్డానని మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అంటూ తారక్ పోస్ట్ చేశారు.
పవన్ ఫ్యామిలీ మెంబర్స్ సైతం ధైర్యంగా ఉండాలని తారక్ కోరారు.

సింగపూర్ లోని స్కూల్ లో జరిగిన ప్రమాదంలో మార్క్ శంకర్ ( Mark Shankar )కు గాయాలయ్యాయి.మార్క్ శంకర్ కోలుకుంటున్నాడని ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల ఇబ్బందులకు సంబంధించి పరీక్షలు చేస్తున్నామని వైద్యులు వెల్లడించారు.ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

తారక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలో రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తుండగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా తారక్ కొన్ని సినిమాలకు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.సినిమా సినిమాకు తారక్ రేంజ్ పెరుగుతోంది.