టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ ( Chiranjeevi, Balayya, Nagarjuna, Venkatesh )తమ కెరీర్ లో సినిమాలతో ఎన్నో విజయాలను అందుకున్నారు.
ఈ హీరోలు సీనియర్ హీరోలు అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.గతంలో చిరంజీవి థమ్సప్ యాడ్( Thumbs up ad ) చేయగా ఈ యాడ్ అప్పట్లో కొన్ని వివాదాలకు కారణమైందనే సంగతి తెలిసిందే.
చిరంజీవి ప్రస్తుతం కంట్రీ డిలైట్ యాడ్( Country Delight Ad ) లో నటించారు.ఈ యాడ్ కు చిరంజీవి భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.స్టార్ హీరో బాలయ్య సాయి ప్రియా గ్రూప్ ( Sai Priya Group )తో యాడ్స్ లోకి అడుగుపెట్టగా వేగ జ్యూవెలర్స్ కు బాలయ్య బ్రాండ అంబాసిడర్ గా పని చేశారు.ఈ యాడ్ కోసం బాలయ్య మూడు కోట్ల రూపాయలు తీసుకున్నారట.
సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ మణప్పురం గోల్డ్ తో పాటు రామరాజు కాటన్ యాడ్స్ కోసం పని చేస్తున్నారు.

ఇవి మాత్రమే కాకుండా పలు టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీల కోసం కూడా వెంకటేశ్ పని చేస్తున్నారు.మరో స్టార్ హీరో నాగార్జున కళ్యాణ్ జ్యూవెలర్స్ యాడ్( Kalyan Jewellers Ad ) కోసం పని చేస్తున్నారు.ఈ బ్రాండ్ తో పాటు డాబర్ మెస్వాక్ కు కూడా నాగార్జున పని చేస్తుండటం గమనార్హం.
టాలీవుడ్ స్టార్ హీరోలు యాడ్స్ కోసం రోజుకు 2 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో అందుకుంటున్నారు.