ఇంట్లో కాస్త అన్నం మిగిలితే మరుసటి రోజు వాడటం మన అలవాటు.అయితే ఈ అలవాటు ఎక్కడికి దారితీస్తుందో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.మిగిలిపోయిన అన్నం తినడం ఆరోగ్యానికి హానికరం అని అనేక పరిశోధనలలో వెల్లడైంది.నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లండ్ ఆధారంగా ఇండిపెండెంట్ ఇచ్చిన నివేదికలో, మిగిలిపోయిన అన్నం తినడం మీ ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు.
అటువంటి పరిస్థితిలో, మీరు మరుసటి రోజు మిగిలిపోయిన అన్నం తినకూడదు.
ఈ నివేదిక ప్రకారం చూస్తే.మిగిలి పోయిన అన్నం తినడం ద్వారా మీరు ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతారు.అన్నం ఉడికిన తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు దానిని ఉంచి, తిన్నప్పుడు దానిలోని బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
అప్పుడు ఫుడ్ పాయిజనింగ్ పరిస్థితి ఏర్పడుతుంది.అందుకే బియ్యాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచకుండా చూడాలి.
ఎక్కువ సేపు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన ఆన్నాన్ని తినకూడదు.అన్నం వండిన గంట లేదా రెండు గంటలలోపు దానిని తినాలి.
అన్నం వండేటప్పుడు దానిని బాగా ఉడికించాలి.
అలాగే అన్నాన్ని గది ఉష్ణోగ్రతలో అధిక సమయం ఉంచకుండా ఫ్రిజ్‌లో ఉంచండి.ఫ్రిజ్‌లో ఉంచితే. కొన్ని గంటల తర్వాత కూడా వాడుకోవచ్చు కానీ.
మిగిలిపోయిన అన్నాన్ని మర్నాడు తినడం అస్సలు మంచిదికాదు.అలాగే అన్నం వేడి చేసి తినాలనిపిస్తే ఒక్కసారి మాత్రమే వేడి చేయలి.
మళ్లీ మళ్లీ వేడి చేసిన అన్నాన్ని అస్సలు తినకూడదు.