చైనా( China ) దేశం ప్రపంచంలో సుప్రీం పవర్ గా ఎదగాలని చూస్తోంది.కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఈ డ్రాగన్ కంట్రీ కల చెదిరేలాగానే కనిపిస్తోంది.
బెయిన్ అండ్ కంపెనీ అనే ప్రముఖ సంస్థ చేపట్టిన తాజా అధ్యయనం ప్రకారం, అమెరికాతో సహా ప్రపంచంలోని అగ్ర దేశాలకు చెందిన పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తిని చైనా నుంచి మరొక దేశానికి మార్చేందుకు నిర్ణయించుకున్నాయి.దీనికి ప్రధాన కారణం ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఉత్పత్తి వ్యయాలు పెరగడం.
ఈ అధ్యయనం కోసం అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన 166 మంది సీఈఓలు, సీఓఓలను సంప్రదించారు.వీరిలో ఎక్కువ మంది సంస్థల వార్షిక ఆదాయం 1 బిలియన్ డాలర్లకు పైగా ఉంది.ఈ అధ్యయనం ప్రకారం, 2022లో 55% కంపెనీలు చైనాపై తమ ఆధారాన్ని తగ్గించాలని భావించినట్లయితే, 2024 నాటికి ఈ సంఖ్య 69%కి చేరుకుంది.ఈ కంపెనీలలో 39% భారతదేశాన్ని తమ కొత్త ఉత్పత్తి కేంద్రంగా ఎంచుకుంటున్నాయి.
అంతేకాకుండా, అమెరికా, కెనడా (16%), దక్షిణ-తూర్పు ఆసియా (11%), పశ్చిమ యూరోప్ (10%), లాటిన్ అమెరికా (8%) దేశాలను కూడా కొన్ని కంపెనీలు ప్రత్యామ్నాయాలుగా పరిగణిస్తున్నాయి.
దీనికి ముఖ్య కారణం డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )చైనా నుంచి దిగుమతులపై 60% వరకు బ్యాన్ విధించాలని ప్రతిపాదించడం.ఈ నిర్ణయం చైనాతో అమెరికా మధ్య వాణిజ్య యుద్ధానికి దారి తీసి, ప్రపంచ వ్యాప్తంగా సరఫరా గొలుసులను అస్తవ్యస్తం చేసింది.దీంతో అనేక కంపెనీలు తమ ఉత్పత్తిని చైనా నుంచి మరొక దేశానికి మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి.
తాజా అధ్యయనం గ్లోబల్ కంపెనీలు చైనాకు పక్కనే ఉన్న దేశాలకు రీలోకేట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.ఇలా కంపెనీలు అక్కడి నుంచి తరలిపోవడం చైనాకు చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు.
ఇవి ఇండియాకి వస్తే భారతీయులకు చాలా లాభాలు ఉంటాయి.