చంద్రశేఖర్ ఏలేటి( Chandrasekhar ) దర్శకత్వంలో, గోపీచంద్( Gopichand ) హీరోగా ఒక్కడున్నాడు అనే సినిమా వచ్చింది మీకు ఎంతమందికి గుర్తుంది.ఈ సినిమాలో బాంబే బ్లడ్ గ్రూప్ కోసం విలన్ ప్రయత్నిస్తూ ఉంటాడు.
నాజర్ తో పాటు ఆ నటుడు సినిమాకి మంచి బలమైన పాత్రలుగా నిలిచారు.సినిమాకి మంచి పేరు వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా కాస్త నెమ్మదించింది అని చెప్పుకోవచ్చు.
అయితే ఈ సినిమాలో విలన్ గా నటించిన అతడి పేరు మహేష్ మంజరేకర్( Mahesh Manjarekar ).ఈ సినిమా తర్వాత హోమం, అదుర్స్, డాన్ శీను, కథ కంచికి మనం ఇంటికి, సర్కార్ వారి పాట వంటి సినిమాల్లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ వస్తున్నాడు.
తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, భోజ్ పూరి, బెంగాలీ భాషల్లో సినిమాల్లో బిజీ నటుడుగా కొనసాగుతూనే దర్శకుడుగా కూడా మెగా ఫోన్ పట్టుకున్నాడు మహేష్ మంజరేకర్.1999 నుంచి దర్శకత్వం బాధ్యతలను తీసుకున్న మహేష్ ఏకంగా తన కెరీర్లో 35 సినిమాల వరకు దర్శకత్వం వహించాడు అంతేకాదు రైటర్ గా, నిర్మాతగా కూడా మారి సినిమాలు తీశాడు.ఇదే కాకుండా టెలివిజన్ లో సైతం తనదైన రీతిలో అభిమానులను మెప్పిస్తూనే మరో వైపు సిరీస్ లలో కూడా కనిపిస్తున్నాడు మహేష్ మంజరేకర్.ఇక నటుడిగా దర్శకుడిగా తన కెరియర్ లో ఎన్ని అవార్డ్స్ అందుకున్నాడో మహేష్ కి సైతం లెక్క పెట్టడం కుదరదు.
అంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఎప్పుడు నటనకు మాత్రం స్వస్తి పలకలేదు.
ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్ల తర్వాత కృష్ణవంశీ ( Krishna Vamsi ) తీసిన సినిమా రంగమార్తాండ ఈ చిత్రానికి మరాఠీలో దర్శకత్వం వహించింది మహేష్ మంజూరేకర్ కావడం విశేషం ఈ సినిమాను తానే రాసుకున్నాడు.2016 లో వచ్చిన ఈ సినిమాలో నానా పాతేకర్ లీడ్ రోల్ లో నటించాడు.ఇక ఈ చిత్రం మరాఠీలో ఏకంగా 40 కోట్ల రూపాయల వసూలను సాధించి విజయవంతమైన చిత్రంగా నిలిచింది.
ఇదే చిత్రాన్ని తెలుగులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం వంటి ప్రముఖులతో కృష్ణ మంజు తీయగా అది తెలుగులో కూడా ఘనవిజయం సాధించింది.