చర్మ సమస్యలకు చెక్ పెట్టె వంటింటి ఇంగ్రీడియెంట్స్

చర్మ సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మార్కెట్ లో దొరికే కాస్మొటిక్స్ వాడుతూ ఉంటారు.అవి ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్ ని కలిగించే అవకాశాలు ఉన్నాయి.

 Best Ingredients For Your Natural Skin Care-TeluguStop.com

అయితే మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువుల ద్వారా చర్మ సమస్యల నుండి బయట పడవచ్చు.ఇవి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

నల్లటి వలయాలు – కుకుంబర్ కుకుంబర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన నల్లటి వలయాలను తొలగించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.కుకుంబర్ స్లైసెస్ మూసి ఉన్న కనురెప్పలపై ఉంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా రోజులో 2 నుంచి 3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పిగ్మెంటేషన్ – బంగాళాదుంప బంగాళాదుంపలో సహజసిద్ధమైన బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది.బంగాళాదుంప రసాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే పిగ్మెంటేషన్ సమస్య నుండి బయట పడవచ్చు.

మృత కణాలు – బేకింగ్ సోడా బేకింగ్ సోడా ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ గా పనిచేసి మృత కణాలను తొలగించటంలో సహాయపడుతుంది.

అరస్పూన్ బేకింగ్ సోడాలో నీటిని కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ముఖానికి రాసి 2 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మృత కణాలు తొలగిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube